
నీట్ పరీక్ష.. ఇదేం శిక్ష
సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025
● కఠిన నిబంధనలతో అష్టకష్టాలు
● 2,975 మందికి 2,914మంది హాజరు
● పలు చోట్ల ఆలస్యం..
అనుమతించని అధికారులు
కరీంనగర్ అర్బన్: జిల్లాలో నీట్ (నేషనల్ ఎలిజిబు లిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. నిబంధనల క్రమంలో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. చెవుల కమ్మలు, ముక్కు పుడుకలు తీసేస్తేనే పరీక్షా కేంద్రానికి అనుమతించగా వాటిని తీసేసేందుకు నానాపాట్లు పడ్డారు. పలువురి చెవులకు గాయమై రక్తం కారింది. షూ, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించలేదు. జిల్లా పరిధిలో ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,975 మందికి 2,914 మంది పరీక్ష రాశారు. 61మంది హాజరు కాలేదు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. ఇక పరీక్షకు హాజరైన అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, తనిఖీ ప్రక్రియ నిర్వహించారు. కరీంనగర్ బైపాస్ రోడ్డులోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీ, ఎస్సారార్ కళాశాలను కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక నోడల్ అధికారిని నియమించామన్నారు. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ వివిధ నీట్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. కలెక్టర్ వెంట నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, తహసీల్దార్ రాజేశ్ పాల్గొన్నారు.
సమయం
మించి పోవడంతో విద్యార్థిని పరుగులు

నీట్ పరీక్ష.. ఇదేం శిక్ష

నీట్ పరీక్ష.. ఇదేం శిక్ష