
అన్నపూజలు.. అభిషేకాలు
వేములవాడ: వేములవాడ రాజన్నను శుక్రవారం 25వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజన్నకు కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజలు, సత్యనారా యణ వ్రతాలు, కల్యాణాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ద్వారా రూ.30 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఆరుద్ర నక్షత్రోత్సవ పూజలు
ఆలయంలో ఆరుద్ర నక్షత్రోత్సవం పురస్కరించుకొని స్వామివారికి అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు.
దర్శించుకున్న దేవాదాయ అధికారులు
రాజన్నను రాష్ట్ర దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్లు కృష్ణప్రసాద్, టంకసాల వెంకటేశ్, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. ఏఈవో శ్రవణ్ స్వామివారి ప్రసాదాలు అందించి సత్కరించారు.
రాజన్న సన్నిధిలో భక్తులు

అన్నపూజలు.. అభిషేకాలు