రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

Apr 28 2025 12:07 AM | Updated on Apr 28 2025 12:07 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పదిర గ్రామ శివారులో ఆదివారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాకు చెందిన కుంచాల మధు(18).. అతడి స్నేహితుడు తన్నీరు మహేశ్‌బాబు(25)తో కలిసి ఎల్లారెడ్డిపేట నుంచి సిరిసిల్లకు ద్విచక్ర వాహనంపై కొత్త దుస్తులు కొనడానికి వెళ్తుండగా.. సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డిపేటకు ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంపై నుంచి ఎగిరిపడ్డ వారు తలలు పగిలి రోడ్డుపై విగతజీవులుగా పడిపోయారు. మధు తండ్రి శివ కొంతకాలంగా స్థానికంగా మేసీ్త్రగా భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. సరిగ్గా 28 రోజుల క్రితం రంజాన్‌కు ఒక్కరోజు ముందు నారాయణపూర్‌కు చెందిన ముస్లిం యువకులు అఫ్రోజ్‌, అవీజ్‌ అనే ఇద్దరు యువకులు కొత్త దుస్తుల కోసం బైక్‌పై సిరిసిల్లకు వెళ్తూ ఇదే రోడ్డుపై కొద్ది దూరంలో ప్రమాదానికి గురై మరణించారు. ప్రమాదానికి కారణమైన కారు కామారెడ్డి జిల్లాకు చెందినది కాగా.. కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. ఎస్సై రమాకాంత్‌ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను సిరిసిల్ల ఏరియాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కారు ఢీకొని ఒకరు..

మెట్‌పల్లి: పట్టణ పరిధిలోని ఆరపేట శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దొడ్డి గంగాధర్‌(59) అనే వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మేడిపల్లి మండలం మాచాపూర్‌కు చెందిన గంగాధర్‌ పట్టణంలోని తిరుమల అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. సాయంత్రం సమయంలో ద్విచక్ర వాహనంపై ఆరపేట వైపు వెళ్తుండగా.. ఎదురుగా కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌ జగిలం శేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం 1
1/2

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం 2
2/2

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

Advertisement
 
Advertisement
Advertisement