కడుపు నొప్పితో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కడుపు నొప్పితో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య

Jul 15 2023 1:56 AM | Updated on Jul 15 2023 1:58 PM

- - Sakshi

మైదుకూరు : కడుపు నొప్పి తాళలేక సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మైదుకూరులో జరిగింది. మృతురాలి తండ్రి యుగంధర్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు మండలం నంద్యాలంపేట –2లో మైదుకూరుకు చెందిన ధనపాల ప్రియాంక (27) అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఆమె కొన్నాళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతుండేది.

నొప్పి ఎక్కువ కావడంతో మూడు రోజుల కిందట విషద్రావణం తాగింది. కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. జిల్లా వ్యవసాయాఽధికారి నాగేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీప్రసన్న ప్రియాంక మృతదేహాన్ని పరిశీలించి, ఆమె తండ్రి యుగంధర్‌ను పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement