నివాళులర్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు
పులివెందుల : వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో సుదీర్ఘకాలం అడుగులో అడుగువేసి నడిచిన వైఎస్ ఆనందరెడ్డి ఇకలేరనే వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన భౌతికకాయానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మలు శుక్రవారం నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్.. ఆనందరెడ్డి సేవలను స్మరించుకుంటూ ఆయన మరణం వైఎస్ కుటుంబానికి, పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ ఆనంద్‌రెడ్డి భౌతిక కాయానికి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, బద్వేలు, రాజంపేట ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, డీసీ గోవిందరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, అంబటి మురళి, పులివెందుల నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. వైఎస్ ఆనంద్ రెడ్డి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం జరిగాయి. ఆనందరెడ్డి భౌతిక కాయాన్ని వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ అభిమానులు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ఆనంద రెడ్డితో తమకు ఉన్న అనుబంధాలను గుర్తుకు తెచ్చుకున్నారు. పులివెందులలోని డిగ్రీ కాలేజీ రోడ్డులో గల వైఎస్‌ఆర్ సమాధుల తోటలో వైఎస్ కుటుంబీకుల సమక్షంలో ఆనందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు.
నివాళులర్పిస్తున్న వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతిరెడ్డి
నివాళులర్పిస్తున్న పి.రవీంద్రనాథ్‌రెడ్డి,
అంజద్‌బాష, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి,
డాక్టర్ సుధ, డీసీ గోవిందరెడ్డి, రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్


