పులివెందుల : పులివెందులకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ వైఎస్ ఆనంద్ రెడ్డి (87) హఠాన్మరణం చెందారు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. మృతుడు వైఎస్ ఆనంద్ రెడ్డి కుమారుడు వైఎస్ రాజేష్ రెడ్డి, కుమార్తెలు సునీత, సాధనలు నేత్రదానం చేయాలని నిర్ణయించి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షుడు రాజుకు సమాచారం అందించారు. వారు ఆనంద్ రెడ్డి నివాసానికి చేరుకుని భౌతికకాయం నుంచి రెండు కార్నియాలను సేకరించి మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మల చేతులమీదుగా స్వీకరించి హైదరాబాద్‌లోని డాక్టర్ అగర్వాల్ నేత్రనిధికి పంపించారు.


