రాయలసీమలో 90 శాతం వర్షాధారంపై పంటలు సాగు చేస్తారు. ఎల్నినో పరిస్థితులు ఏర్పడ్డాయి గనుక జూన్, జులైలో వర్షాలు రాక సీజన్ ముగిసింది. ఒకవేళ అక్టోబరులో తుఫాన్లు సంభవిస్తే మెట్ట ప్రాంతాల్లో శనగ తదితర పంటలు సాగు చేసుకోవడానికి వీలుంటుంది. ఇక మిగిలిన పది శాతం భూమికి ప్రాజెక్టుల కింద నీటిపారుదల సౌకర్యం ఉంది. శ్రీశైలంలో 865 అడుగుల నీటిమట్టాన్ని నిర్వహించడం ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు సాగునీరు అందించాలి. ఖరీఫ్ కాకపోయినా రబీలోనైనా పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. – దేవగుడి చంద్రమౌళీశ్వర్రెడ్డి, రైతు నాయకుడు, కడప


