వేంపల్లె : జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవా ణాపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ షెల్కే నచి కేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. గురువారం వేంపల్లెలోని స్థానిక పోలీసుస్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. పలు కేసులకు సంబంధించిన రికార్డులను, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. గ్రామాల్లోని పరిస్థితులపై సీఐ నరసింహులును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గంజాయి బ్యాచ్‌లపై కేసులు కూడా పెట్టినట్లు తెలిపారు.
విద్యార్థినుల భద్రతపై అవగాహన సదస్సు
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని స్థానిక జేఎన్‌టీయూ కళాశాలలో గురువారం విద్యార్థినుల భద్రత, మహిళా రక్షణ, సైబర్ నేరాల నివారణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హాజరై విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవల గురించి వివరించారు.
ప్రశాంత వాతావరణంలో
ఎన్నికలు నిర్వహిస్తాం
పులివెందుల రూరల్ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ అన్నారు. గురువారం సాయంత్రం పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి ఫ్యాక్షన్ గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. డీఎస్పీ మురళి నాయక్, సీఐ శ్రీరామ్, ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.
త్వరలోనే కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ
చక్రాయపేట: జిల్లాలోని ఖాళీగా ఉన్న పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.గురువారం ఆయన చక్రాయపేట పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సుధాకర్ పాల్గొన్నారు.
లింగాల : లింగాల మండలంలోని ఇప్పట్ల గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడారు. స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
మాట్లాడుతున్న ఎస్పీ నచికేత్ విశ్వనాథ్


