భూమి కేటాయించాలని కోరాం | - | Sakshi
Sakshi News home page

భూమి కేటాయించాలని కోరాం

Jul 19 2026 2:14 AM | Updated on Jul 19 2026 2:14 AM

భూమి కేటాయించాలని కోరాం పరికరాలు అందించాలి

బొమ్మలరామారం మండలానికి మంజూరైన ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు కోసం సుమారు ఎకరం భూమి అవసరం ఉంది. ఇందుకోసం అనువైన స్థలాన్ని కేటాయించాలని రెవెన్యూ అధికారులను కోరాం. ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటైతే కూరగాయల రైతులకు బహుల ప్రయోజనాలు ఉంటాయి. తమ పంటలను సులభంగా మంచి గిట్టుబాటు ధరలకు అమ్ముకోవడానికి వేదిక కానుంది.

– యాదగిరి, సెర్ప్‌ ఏపీఎం

రవాణా భారం, కూలీల కొరత వల్ల కూరగాయల సాగు తగ్గించాం. రైతులకు సబ్సిడీపై పరికరాలు, విత్తనాలు, ఎరువులు అందించాలి. మండలంలో ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తే చాలా మంది రైతులు మళ్లీ కూరగాయల సాగు వైపు వస్తారు. అధికారులు ఈ దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలి.

– దాసరి జంగారెడ్డి, రైతు, హాజీపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement