హుజూర్‌నగర్ : బైక్‌పై సారా తరలిస్తున్న వ్యక్తిని ఎకై ్సజ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎకై ్సజ్ ఎస్‌ఐ దివ్య తెలిపిన వివరాల ప్రకారం.. పాలకవీడు మండలం అలింగాపురం గ్రామానికి చెందిన మట్టపల్లి సైదులు తన బైక్‌పై సారా తరలిస్తుండగా.. వాహనాల తనిఖీల్లో భాగంగా ఎకై ్సజ్ పోలీసులు అతడిని పట్టుకున్నారు. అతడి నుంచి 8 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని బైక్ సీజ్ చేసినట్లు ఎకై ్సజ్ ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మండలం తొండ గ్రామ శివారులో 365బీ జాతీయ రహదారిపై ఆదివారం కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగపురం గ్రామానికి చెందిన వ్యక్తి కారులో తిరుమలగిరి నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన సదరు వ్యక్తిని స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
షార్ట్ సర్క్యూట్‌తో
ఇల్లు దగ్ధం
బొమ్మలరామారం : మండలంలోని మర్యాల గ్రామం ఎస్సీ కాలనీలో నివాసముంటున్న సంగి స్వామి ఇంట్లో ఆదివారం షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో ఇరుగుపొరుగు వారు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. ఇంట్లోని సామగ్రి, నిత్యావసర వస్తువులతో పాటు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం అప్పుగా తీసుకొచ్చిన రూ.2.50లక్షల నగదు కాలిపోయాయనని బాధితుడు స్వామి బోరున విలపించాడు. తహసీల్దార్ శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులకు బియ్యం, నిత్యావసర సరకులు అందజేశారు.
ఎస్‌ఐ కుటుంబానికి
రూ.25 లక్షలు ఆర్థికసాయం
చిలుకూరు : మండలంలోని బేతవోలు గ్రామానికి చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కీసరలో ఎస్‌ఐగా పనిచేస్తూ అకాల మరణం చెందిన గుండెపంగు వెంకటనారాయణ కుటుంబానికి ఆదివారం తోటి ఉద్యోగులు రూ.25 లక్షల ఆర్థికసాయం చేశారు. ఈ మేరకు చిలుకూరు ఎస్‌ఐ మోహన్‌బాబు ఆధ్వర్యంలో 50 మందికి పైగా ఎస్‌ఐలు కలిసి చెక్కును వెంకటనారాయణ కుటుంబ సభ్యులకు అందజేశారు.


