సబ్‌జైలు తనిఖీ | - | Sakshi
Sakshi News home page

సబ్‌జైలు తనిఖీ

Jul 19 2026 12:50 AM | Updated on Jul 19 2026 12:50 AM

సబ్‌జైలు తనిఖీ నూతన ఆవిష్కరణలు అవసరం రేపు ‘షైనింగ్‌ స్టార్స్‌’ ప్రదానం క్రీడా పోటీలకు నమోదు రోడ్డు మెటీరియల్‌ దుర్వినియోగంపై కేసు

భీమవరం: ముద్దాయిలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని భీమవరం మండల న్యాయ సేవాసంస్థ చైర్మన్‌, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బి.లక్ష్మీనారాయణ అన్నారు. పట్టణంలోని ప్రత్యేక ఉపకారాగారాన్ని శనివారం ఆయన సందర్శించి ముద్దాయిలతో మాట్లాడి కేసు వివరాలను తెలుసుకున్నారు. ఉచిత న్యాయవాది అవసరమైతే సంస్థకు అర్జీ పెట్టుకోవచ్చునన్నారు. జైలు పరిసరాలను, ముద్దాయిలకు అందిస్తున్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. బార్‌ అసోసియే షన్‌ అధ్యక్షుడు యేలేటి న్యూటన్‌, జైలు సూపరింటెండెంట్‌ డి.వెంకటగిరి, ప్యానల్‌ న్యాయవాదులు అంబేడ్కర్‌, వెంకటరమణ, లోకేశ్వరరావు, జ్యోతి తదితరులు ఉన్నారు.

పెంటపాడు: శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులు మేధావులుగా తయారయ్యేలా ఉపాధ్యాయులు నూతన ఆవిష్కరణలు చేయించాలని డీఈఓ నారాయణ, డీవైఈఓ కె.రామాంజనేయులు అన్నా రు. శనివారం స్థానిక ప్రభుత్వ పోస్టు బేసిక్‌ పాఠశాలలో నాన్‌ లాంగ్వేజ్‌ పీఎస్‌, బయాలజీ సబ్జెక్టులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కోర్సు డైరెక్టర్‌గా డీవైఈఓ వ్యవహరించారు. జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుతూ వ్యక్తిగత పరిశుభ్రతను పెంపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. విద్యాశాఖ కమిషనర్‌ తమీం అ న్సారీ ఆన్‌లైన్‌లో మాట్లాడారు. హెచ్‌ఎం పద్మజ, రిసోర్స్‌ పర్సన్‌ నక్కా శివనాగమణి, ఎంఈవోలు ఎం.శ్రీనివాస్‌, టీవీ రామకృష్ణ పాల్గొన్నారు.

భీమవరం: జిల్లాలో పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు శనివారం పట్టణంలోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులు అందించనున్నట్టు డీఈఓ ఈ.నారాయణ శనివారం ప్రకనటలో తెలిపారు. ప్రతి మండలంలో ఆరుగురు, జిల్లాలో సీడబ్ల్యూఎస్‌ఎన్‌ కేటగిరీలో ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి అవార్డుతో సత్కరించనున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో 127 మంది విద్యార్థులకు పతకం, ప్రశంసాపత్రం, రూ.20 వేల నగదు బహుమతితో సత్కరిస్తారని తెలిపారు.

భీమవరం: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పు రస్కరించుకొని శాప్‌ ఆధ్వర్యంలో వచ్చేనెల 26 వరకు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అమరావతి చాంపియన్‌షిప్‌–2026 క్రీడా పో టీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అ ధికారి మోహన్‌దాస్‌ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

అత్తిలి: మంచిలి కనకదుర్గమ్మవారి ఆలయం వెనుక నిల్వచేసిన రోడ్డు మెటీరియల్‌ను దుర్వినియోగం చేశారనే ఆరోపణపై అదే గ్రామానికి చెందిన నల్లమిల్లి వెంకట కృష్ణారెడ్డిపై కేసు న మోదు చేసినట్లు అత్తిలి ఎస్సై కేఎన్‌ విశ్వనాథ్‌ తెలిపారు. మంచిలి నుంచి కోరుకొల్లు వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణం నిమిత్తం రూ.2 లక్షల విలువైన 35 యూనిట్ల రోడ్డు మెటీరియల్‌ను కాంట్రాక్టర్‌ నిల్వ చేశారు. కృష్ణారెడ్డి ట్రా క్టర్‌తో ఆ మెటీరియల్‌ను చదును చేయడంతో అది మట్టిలో కలిసిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంట్రాక్టర్‌ సిండ్రకొల్లు వీరభద్రరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement