పుష్కర భక్తులకు ఇబ్బందులు తప్పవా?
నరసాపురం: నరసాపురం మున్సిపాలిటీ పరిధిలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టమ్ ఏర్పాటు కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.220 కోట్లు మంజూరు చేసింది. ఈ భారీ ప్రాజెక్టును దాదాపు మరో 50 ఏళ్లపాటు పట్టణంలో డ్రెయినేజీ సమస్యలు తలెత్తకుండా ఉండేలా రూపకల్పన చేశారు. దీనికి సంబంధించి మొదటి దశ పనుల కోసం రూ.87 కోట్లు మంజూరు చేయడంతో పాటు, ఆర్థిక శాఖ అనుమతులు కూడా లభించాయి. ఇందులో భాగంగా 1 నుంచి 9 వరకు ఉన్న వార్డుల్లో పనులు ప్రారంభించేందుకు రూ.47 కోట్లతో టెండర్ల ప్రక్రియను సైతం పూర్తి చేశారు. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పూర్తిగా బుట్టదాఖలైంది. దీంతో పట్టణ డ్రెయినేజీ వ్యవస్థకు మోక్షం కలుగుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది.
అస్తవ్యస్తంగా డ్రెయినేజీ వ్యవస్థ
నరసాపురం పట్టణ డ్రెయినేజీ వ్యవస్థ ప్రస్తుతం అ త్యంత క్షీణదశకు చేరుకుంది. గతంలో ఇటు నియోజకవర్గంలోనూ, అటు మున్సిపాలిటీలోనూ టీడీపీ సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పటికీ.. ప్రణాళికాబద్ధంగా డ్రెయినేజీలను నిర్మించకపోవడం, పనుల్లో నాణ్యతా లోపాలు ఉండటం వల్ల పరిస్థితి మరింత దిగజారింది. గత పాలకులు ఎన్నో ఏళ్లుగా హామీలు గుప్పిస్తూ వచ్చినా ఎలాంటి పనీ జరగలేదు. చివరకు వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చొరవతో ఈ భారీ ప్రాజెక్టు మంజూరైనప్పటికీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలకు మురుగు కష్టాలు తప్పడం లేదు.
అధ్వానంగా మారిన డ్రెయిన్లు
● ప్రస్తుతం పట్టణంలోని చాలా ప్రాంతాల్లో డ్రె యినేజీ సమస్యలు జఠిలంగా మారాయి.
● పట్టణంలోని బస్టాండ్ సెంటర్, మాధవాయిపాలెం, రాయపేట, రుస్తుంబాద ప్రాంతాల్లో ప్రధాన డ్రెయినేజీలు ఉన్నాయి. వివిధ వార్డుల వీధుల్లోని ఉప డ్రెయిన్లన్నీ ఈ ప్రధాన డ్రెయినేజీల్లోకే కలుస్తాయి.
● డ్రెయినేజీలు అధ్వానంగా మారడంతో స్వల్ప వర్షానికే బస్టాండ్ ఏరియా, పొన్నపల్లి, నందమూరి కాలనీ, వైఎస్సార్ నగర్ ప్రాంతాలు జలమయమవుతున్నాయి.
● అలాగే 21 నుంచి 27 వరకు గల వార్డులతో పాటు పొన్నపల్లి, మాధవాయిపాలెం, స్టేషన్ పే ట ప్రాంతాల్లోని మైనర్ డ్రెయిన్లు పూర్తిగా శి థిలావస్థకు చేరాయి. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ ప్రాజెక్టు పూర్తయితేనే ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
నరసాపురం పట్టణ వ్యూ
కూటమి నిర్లక్ష్యం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టు మంజూరు
నరసాపురంలో రూ.220 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి శ్రీకారం
తొలి దశలో రూ.87 కోట్లు కేటాయింపు
కూటమి ప్రభుత్వంలో అటకెక్కిన ప్రాజెక్టు
ఏడాదిలో (2027 జూలై 27 నుంచి) గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న నరసాపురంలో స్నానాల కోసం లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా. పైగా, వర్షాలు ఎక్కువగా పడే రోజుల్లోనే పుష్కర మహోత్సవం జరగనుంది. పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థ ఇలాగే ఉంటే, వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. పుష్కరాల దృస్ట్యా ప్రభుత్వం తక్షణమే స్పందించి, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.


