ఉపాధ్యాయులకు టెట్‌ రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులకు టెట్‌ రద్దు చేయాలి

Jul 21 2026 2:06 AM | Updated on Jul 21 2026 2:06 AM

ఉపాధ్యాయులకు టెట్‌ రద్దు చేయాలి పీజీఆర్‌ఎస్‌లో వైఎస్సార్‌టీఏ నాయకుల విజ్ఞప్తి ఆర్‌ఎంపీపై ఫిర్యాదు

నా భర్త ఆచూకీ చెప్పండి

పీజీఆర్‌ఎస్‌లో వైఎస్సార్‌టీఏ నాయకుల విజ్ఞప్తి

తన భార్య రత్నకుమారికి గర్భ సంచి ఆపరేషన్‌ నిమి త్తం తాడేపల్లిగూడెంలోని ఓ క్లినిక్‌కు వెళితే అక్కడి వైద్యురాలు పెంటపాడుకు చెందిన ఆర్‌ఎంపీతో ఆపరేషన్‌ చేయించిందని ఉంగుటూరుకు చెందిన తాడేపల్లి రత్నంరాజు తెలిపారు. ఆర్‌ఎంపీ ఆపరేషన్‌ చేసే క్రమంలో యూరిన్‌ బ్యాగ్‌ను తొలగించడంతో తన భార్య పరిస్థితి విషమంగా మారిందని వాపోయారు. దీంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం చేయించానని, ఆర్‌ఎంపీతో వైద్యం చేయించిన వైద్యురాలు, ఆర్‌ఎంపీపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

భీమవరం/భీమవరం (ప్రకాశం చౌక్‌): ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ రద్దు చేయాలని వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషనన్‌ (వైఎస్సార్‌టీఏ) ఆధ్వర్యంలో కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణికి వినతిపత్రం అందజేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జిల్లా అధ్యక్షుడు మురాల సుధాకర్‌, జనరల్‌ సెక్రటరీ యార్లపాటి రమేష్‌బాబు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇన్‌సర్వీస్‌ టీచర్లకు టెట్‌ నిర్వహణను విరమించుకుకోవాలనే తమ వేదనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని కోరారు. యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొడ్డు రాంబాబు, తణు కు నియోజకవర్గ వైఎస్సార్‌ టీచర్స్‌ వింగ్‌ అధ్యక్షుడు ఎస్‌వీ జాకబ్‌బాబు, జిల్లా కోశాధికారి తామరపల్లి పల్లయ్య, స్టూడెంట్‌ వింగ్‌ నాయకుడు అంబటి శ్యాంసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

194 అర్జీల స్వీకరణ

ప్రజాసమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లిని క్‌లలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించినట్టు కలెక్టర్‌ తెలిపారు. పీజీఆర్‌ఎస్‌లో 141, రెవెన్యూ క్లినిక్‌లో 53 అర్జీలు స్వీకరించామన్నారు.

సాగునీటి సమస్యపై..

జిల్లాలో పోడూరు, యలమంచిలి మండలాల్లోని పలు కాలువలపై ఆధారపడిన ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ కౌలు రైతు సంఘ నాయకులు కోరారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో తన భర్త విజయ దుర్గాప్రసాద్‌ను ప్రైవేట్‌ బస్‌ క్లీనర్‌ పని నిమిత్తం కాకరపల్లికి చెందిన గుడాల శివ అనే వ్యక్తి తీసుకువెళ్లాడని, రెండు రోజుల తర్వాత నుంచి తన భర్త నుంచి ఫోన్‌ కాల్స్‌ రావడం లేదని ఆచంటకు చెందిన కడలి పుణ్యవతి ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలు కావస్తున్నా తన భర్త ఆచూకీ లభించలేదని, ఆచంట పోలీసులకు ఫిర్యాదు చేయగా శివను తీసుకువచ్చి విచారణ చేసినా సమాచారం లభించలేదని అన్నారు. తన భర్త ఆచూకీ కనిపెట్టాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement