భీమవరం : నేరంలో శిక్షపడ్డ ముద్దాయిలు, నే రారోపణలో జైలులో ఉన్న ముద్దాయిలు మా రిన మనిషిగా బయటకు రావాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. సోమవారం పట్టణంలోని సబ్‌జైలును ఆమె సందర్శించారు. ముద్దాయిలతో మాట్లాడుతూ ఇకపై నేరాల జోలికి పోకుండా గౌరవ మర్యాదలతో, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ జీవి తం గడపాలన్నారు. అనంతరం జైలు పరిసరాలను పరిశీలించి భోజన పదార్థాలను రుచిచూశారు. జైలు సూపరింటెండెంట్ డి.వెంకటగిరి, ప్యానల్ న్యాయవాదులు వెంకటరమణ, సూ ర్యనారాయణ, నాగబాబు, భాగ్యశ్రీ, సురేష్‌కుమార్, మహిమా జ్యోతి, శ్రీలక్ష్మి ఉన్నారు.
భీమవరం : పోటీపరీక్షల పేపర్ లీకేజీలు, వి ద్య, పరీక్షల వ్యవస్థలో అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్యమానికి మద్దతుగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్‌ఏ) ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నిరసన చేపట్టారు. ఏఐఎస్‌ఏ జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి మాట్లాడుతూ ఇటీవల నీట్ పేపర్ లీకేజీ కారణంగా ప్రతిభ గల వి ద్యార్థులు నష్టపోయారన్నారు. సమస్యల పరిష్కారం కోసం జంతర్ మంతర్ వద్ద 23 రోజులుగా పలు సంఘాల ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయన్నారు. ఉద్యమకారులతో కేంద్ర ప్రభుత్వం చర్చించకుండా దీక్ష శిబిరాన్ని భంగం చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. ఆర్‌వైఏ జిల్లా కన్వీనర్ యు.మురళీ, ఐసా జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లూరి రాంప్రసాద్, ఎం.హరిప్రియ, ఆర్.రమ్య పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాల యాల్లో దశాబ్ధాలుగా సేవలందిస్తున్న కాంట్రా క్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను తక్షణమే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణం వద్ద ఉద్యోగులు సోమవారం నిరసన చేపట్టారు. ప్రభు త్వం అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొ ఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందని, దీంతో దీర్ఘకాలంగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కాంట్రాక్టు ఉ ద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని డి మాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూ డిన వినతిపత్రాన్ని ప్రిన్సిపాల్ టి.అశోక్‌కు అందజేశారు. విశ్వవిద్యాలయాల కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం ఉపాధ్యక్షుడు హీరాభట్టు, సంయుక్త కార్యదర్శి పి.ప్రశాంతి, సభ్యు లు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిధుల మంజూరుపై నివేదికలు సిద్ధం చేయాలని జేసీ కేఆర్ కల్పశ్రీ ఆదేశించారు. సోమవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో గుర్తించిన 34 పుష్కర ఘాట్లలో మౌలిక వసతుల కల్పన, మరమ్మతుల కోసం ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు, పనుల అంచనా వ్య యం, ప్రస్తుత స్థితిపై నివేదికను సిద్ధం చేయా లని ఆదేశించారు.
భీమవరం: జిల్లాలో రైతులకు సాగునీటికి ఇ బ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్షాబావ పరిస్థితుల దృష్ట్యా శివారు ప్రాంతాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కంపోస్ట్ ఎరువు తయారీపై..
భీమవరం (ప్రకాశంచౌక్): గుర్రపుడెక్క నుంచి కంపోస్ట్ ఎరువు తయారు చేసి స్వయం సహాయక సంఘాలు ఆర్థిక పరిపుష్టి చెందిలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంపీడీఓలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీఓలు, డీఆర్‌డీఏ ఏపీఎంలు, వీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు.
గ్రామీణ క్రీడా ఉత్సవం
18వ ఈశా గ్రామోత్సవం పోటీలను భీమవరంలో ఈనెల 25, 26న నిర్వహించనున్నట్టు క లెక్టర్ తెలిపారు. పోస్టర్లను ఆవిష్కరించారు.


