మహిళలకు రక్షణ కరవు | - | Sakshi
Sakshi News home page

మహిళలకు రక్షణ కరవు

Jul 22 2026 2:17 AM | Updated on Jul 22 2026 2:17 AM

మహిళలకు రక్షణ కరవు రాజకీయ ఒత్తిళ్లతో మహిళలకు అన్యాయం ప్రశ్నార్థకంగా మహిళల భద్రత ప్రభుత్వం స్పందించదా? ●

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ రెండేళ్లలో ఎక్కడ చూసినా మహిళలపై దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలే. మహిళలకు ఎలాంటి రక్షణ లేదు. రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో మహిళలకు భద్రత కరువైంది. నిందితులకు ప్రభుత్వ పెద్దలే కొమ్ముకాస్తున్నారు.

– కోడే విజయలక్ష్మి, వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు

మహిళలపై జరుతున్న అకృత్యాలపై రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలీసులు కేసుల నమోదులో జాప్యం చేస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవడంలో ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. దీంతో బాధితులకు న్యాయం జరగడం లేదు. మహిళల ఉసురు పోసుకుంటున్న కూటమి నాయకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

– గూడూరి ఉమాబాల, వైఎస్సార్‌సీపీ నరసాపురం పార్లమెంట్‌ సమన్వయకర్త

కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నా నిరోధించడంలో ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపడంలేదు. పోలీస్‌ యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీ తొత్తుగా మారిపోవడం దురదృష్టకరం.

– కర్రా జయచరిత, వైఎస్సార్‌సీపీ స్టేట్‌ మహిళా వింగ్‌ జనరల్‌ సెక్రటరీ

ఇటీవల గుంటూరు, బద్వేలు వంటి ప్రాంతాల్లో మహిళలను వివస్త్రలను చేసి అవమానించిన అమానవీయ ఘటనలు ప్రభుత్వ అసమర్థ పాలనకు అద్దం పడుతోంది. ఇలాంటి ఘటనలు నాగరిక సమాజానికే మాయని మచ్చ. ప్రభుత్వ పెద్దలు రాజకీయాలను పక్కన పెట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా చర్యలు తీసుకోవాలి.

– పాలవెల్లి మంగ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement