రెగ్యులేటర్లకు గ్రహణం | - | Sakshi
Sakshi News home page

రెగ్యులేటర్లకు గ్రహణం

Jul 22 2026 2:17 AM | Updated on Jul 22 2026 2:17 AM

న్యూస్‌రీల్‌

జగన్‌ చొరవతో..

మూడు ప్రాంతాల్లో రెగ్యులేటర్ల నిర్మాణం

బుధవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2026

నరసాపురం: అటుపక్క కొల్లేరు, ఇటు పక్క సముద్రం ద్వారా వస్తున్న ఉప్పునీటి సమస్యకు చెక్‌ పెట్టాలని, ముఖ్యంగా భూగర్భ జలాలు ఉప్పు నీటిమయం కాకుండా చూడాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆలోచన చేసి మంజూరు చేసిన రెగ్యులేటర్ల నిర్మాణం కూటమి ప్రభుత్వం రాకతో అటకెక్కింది. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటుతున్నా.. ఈ ప్రాజెక్ట్‌పై ఉలుకూ పలుకూ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 2022లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.642.22 కోట్లతో రెగ్యులేటర్లు నిర్మించాలని నిర్ణయించింది. ఇరిగేషన్‌ శాఖ చేసిన ప్రతిపాదనలకు వెంటనే పాలనా అనుమతులు కూడా అప్పటిలో వెలువడ్డాయి. దీంతో టెండర్లు పిలిచారు. ఈ ప్రాజెక్ట్‌తో ఉప్పుటేరు కలుషితం కాకుండా నివారించడంతో పాటు, కొల్లేరు సరస్సులోని కొంతభాగం ఉప్పునీటి ప్రభావానికి లోనుకాకుండా ఉండేలా ప్రాజెక్ట్‌ రూపకల్పన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండుచోట్ల, కృష్ణా జిల్లాలో ఒకచోట రెగ్యులేటర్లు కమ్‌ వంతెనల నిర్మాణాలకు రూ.642.22 కోట్లతో ప్రాజెక్ట్‌ను రూపొందించారు.

ఉప్పునీరుగా మారుతున్న కొల్లేరు

కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించిన కొల్లేరు సరస్సులో సుమారు 67 వరకూ చిన్న, మధ్యస్థ, పెద్ద డ్రైయిన్లు కలుస్తున్నాయి. ఈ నీరంతా కొల్లేరు సరస్సు నుంచి ఆకివీడు మండలంలోని దుంపగడప వద్ద ఉప్పుటేరులో కలుస్తుంది. మళ్లీ ఆ నీరు సుమారు 64 కిలోమీటర్ల మేర ప్రవహించి, మన జిల్లా శివారున ఉన్న మొగల్తూరు సమీపంలోని కృష్ణా జిల్లా చినగొల్లపాలెం వద్ద సముద్రంలో కలిసిపోతుంది. దీంతో పాటు జిల్లాలోని పలు ఉప్పుటేరుల్లోని నీరు కూడా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్‌ మోళ్లపర్రు సీమౌత్‌ వద్ద కలుస్తుంది. సముద్రంలో కలవడం ద్వారా ఇదంతా ఉప్పునీరుగా మారుతుంది. సముద్రం ఆటుపోట్ల వల్ల మళ్లీ సముద్రంలోని ఈ ఉప్పునీరే ఈ సీమౌత్‌ ద్వారా రివర్స్‌లో డ్రైయిన్లలోకి ప్రవేశించి ఉప్పునీరుగా మారుతోంది. ఒకప్పుడు చప్పనీరుగా ఉండే కొల్లేరు సరస్సులోని చాలా భాగం ఉప్పునీరుగా మారడానికి కూడా కారణం ఇదేనని గతంలో జరిగిన సర్వేల్లో తేలింది. ఉప్పునీరంతా తిరిగి డ్రైయిన్లలో కలవడం ద్వారా అటు సాగుకు, ఇటు తాగునీటికి కూడా పనికిరాకుండా పోతోంది.

ఊసే ఎత్తని ఇరిగేషన్‌ మంత్రి

జిల్లాకు చెందిన నిమ్మల రామానాయుడు ఇరిగేషన్‌ మంత్రిగా ఉన్నారు. పూర్తిగా ఇరిగేషన్‌ శాఖకు చెందిన ఈ ప్రాజెక్ట్‌ మంత్రి ద్వారా పట్టాలెక్కుతుందని రెండు జిల్లాల వాసులు ఆశించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఉప్పునీటి సమస్యతో అటు సాగు, ఇటు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు, ముఖ్యంగా రైతులు తమ కష్టాలకు చెక్‌ పడుతుందని సంతోషించారు. మంత్రి గానీ, ఎమ్మెల్యేలు గానీ ఈ ప్రాజెక్ట్‌పై కనీసం నోరుమెదపకపోవడంతో నిరాశ చెందుతున్నారు.

ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి, ఈ సమస్య నివారణకు వాటర్‌ రిసోర్సెస్‌ ప్రాజెక్టు కమిటీ నిపుణుల సలహా కోరారు. కమిటీ నిపుణులు సర్వే చేసి, మూడు చోట్ల రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టి, మూడు దశల్లో నీటిని అదుపుచేస్తే సమస్య పరిష్కారమవుతుందని సూచించడంతో యుద్ధప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్‌ రూపకల్పనకు అప్పట్లో ఆదేశాలు ఇచ్చారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు మండలం దుంపగడపలో రూ.111 కోట్లతో రెగ్యులేటర్‌, మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్‌ పంచాయతీ మోళ్ళపర్రు వద్ద (సముద్రం–ఉప్పుటేరు కలిసే సీమౌత్‌) రూ. 364.87 కోట్లతో రెగ్యులేటర్‌ కమ్‌ వంతెన, కృష్ణా జిల్లా పడతడిక వద్ద రూ.166.35 కోట్లతో రెగ్యులేటర్‌ కమ్‌ వంతెన నిర్మించేందుకు పాలనా అనుమతులు ఇవ్వడంతో 2023 డిసెంబరులో టెండర్లు పిలిచారు. తరువాత ఏడాది ప్రారంభంలోనే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ప్రాజెక్ట్‌ అటకెక్కింది.

నిలిచిన రూ.642.22 కోట్ల ప్రాజెక్ట్‌

ఉప్పుటేరుపై రెగ్యులేటర్ల నిర్మాణాలకు గత ప్రభుత్వం ప్రయత్నం

సాంకేతిక అనుమతులు మంజూరు

డెల్టాలో ఉప్పు నీటి ఇబ్బందుల నివారణకు చర్యలు

పట్టించుకోని ప్రస్తుత ఇరిగేషన్‌ మంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement