మావుళ్లమ్మకు బంగారం సమర్పణ
భీమవరం (ప్రకాశంచౌక్): శ్రీ మావుళ్లమ్మ తల్లికి సంపూర్ణ స్వర్ణ వస్త్రం నిధికి ముప్పాళ్ళ నరసరాజు, నాగమణి దంపతులు రూ.లక్ష విరాళంగా అందజేశారు.
భీమడోలు: తాగుబోతు భర్త బారి నుంచి ఒక మహిళను భీమడోలు పోలీసులు అత్యంత వేగంగా స్పందించి కాపాడారు. కుటుంబ కలహాల వల్ల దూరంగా ఉంటున్న సీతారత్నాన్ని, ఆమె భర్త రాజు భీమడోలు బస్టాండ్‌లో బెదిరించి బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లాడు. ప్రమాదాన్ని గ్రహించిన ఆమె వెంటనే శక్తి యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. సీఐ వి.కృష్ణ ఆదేశాలతో ఎస్సై మదీనా బాషా ఆధ్వర్యంలో హెచ్‌సీ సూరిశెట్టి శ్రీనివాసరావు, హోంగార్డు పరమేశ్‌లు జీపీఎస్ ఆధారంగా వెంబడించారు. పోలీసులను చూసి రాజు పారిపోవడంతో సీతారత్నాన్ని సురక్షితంగా కాపాడారు. సమయస్ఫూర్తిగా స్పందించి తన ప్రాణాలు కాపాడిన పోలీసులకు బాధితురాలు కృతజ్ఞతలు తెలిపింది.
దెందులూరు: కడుపు నొప్పి తాళలేక కలుపు మందు తాగిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్సై డి వెంకట్‌కుమార్ తెలిపిన వివరాలివి. చల్ల చింతలపూడి గ్రామంలో బలిరెడ్డి బంగారయ్య భార్య వరలక్ష్మి (66) కడుపునొప్పి తాళలేక ఇంట్లో ఉన్న కలుపుమందు తాగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించి వైద్యం కోసం భీమడోలు వైద్యశాలకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ వైశ్యాలకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.


