చలామనీ తగ్గింది | - | Sakshi
Sakshi News home page

చలామనీ తగ్గింది

Jul 21 2026 2:06 AM | Updated on Jul 21 2026 2:06 AM

చలామనీ తగ్గింది

నాడు కళకళ

నేడు వెలవెల

బోణీకీ కష్టమే..

దారుణంగా పడిపోయాయి

మెటీరియల్‌ వ్యాపారం దెబ్బతింది

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమ్మఒడి, వైఎస్సార్‌ ఆసరా, చేయూత, రైతు భరోసా, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నేతన్న నేస్తం.. ఇలా ప్రతి నెలా ఏదోక పథకం పేదలకు అందడంతో మార్కెట్‌లో మనీ రొటేషన్‌ జరిగేది. ఉదాహరణకు 2023 జనవరి నుంచి డిసెంబరు వరకు సంక్షేమం రూపంలో రూ.1,191 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమచేశారు. గ్రామగ్రామానా జగనన్న కాలనీల్లో రూ.1,263 కోట్లుతో చేపట్టిన పక్కా ఇళ్లు, రూ.260 కోట్లతో సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ సెంటర్లు నిర్మాణాలు, నాడు–నేడులో రూ.369 కోట్లుతో పాఠశాలల అభివృద్ధి, రూ. వందల కోట్లతో జిల్లాలో ఆక్వావర్సిటీ, మెడికల్‌ కళాశాల, ఆస్పత్రుల అభివృద్ధి కార్యక్రమాల ద్వారా భవన నిర్మాణం, అనుబంధ రంగాల్లోని కార్మికులు, వ్యాపారులకు ఏడాది పొడవునా పనిదొరికి చేతినిండా డబ్బులతో వ్యాపారాలు కళకళలాడేవి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీతో విద్య, వైద్యానికి ప్రభుత్వ భరోసా ఉండేది.

సూపర్‌ సిక్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది సంక్షేమాన్ని విస్మరించింది. 2025 జనవరి నుంచి డిసెంబరు వరకు ఏడాది కాలంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, గ్యాస్‌ సబ్సిడీ, మత్య్సకార భృతి, వాహనసేవ పథకాల ద్వారా జిల్లావాసులకు జమచేసింది కేవలం రూ.409 కోట్లే. గత ప్రభుత్వం చేసిన మేలులో ఇది కేవలం మూడో వంతు మాత్రమే. విద్యుత్‌ చార్జీలు, ఇంటి పన్నులు, నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. ఇసుక కొరత, అభివృద్ధి పనులు నిలిచిపోవడం, రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలై కార్మికులకు సరిగా పనుల్లేక ప్రజల్లో కొనుగోలుశక్తి తగ్గి ఆ ప్రభావం తమపై పడిందని వ్యాపారులు అంటున్నారు.

వ్యాపారం వెలవెల

మార్కెట్లు ఢీలా

తగ్గిన మనీ రొటేషన్‌

బేరాల్లేక ఖాళీగా దుకాణాలు

గత ప్రభుత్వంలో వ్యాపారాల జోరు

2023లో జిల్లాలోని పేదలకు చేకూరిన సంక్షేమ లబ్ధి రూ.1,191 కోట్లు

2025లో లబ్ధి కేవలం రూ.409 కోట్లే..

తణుకులోని వేల్పూరు రోడ్డు వ్యాపారానికి పేరొందింది. ఈ రోడ్డులో క్లాత్‌, రెడీమేడ్‌, ఫ్యాన్సీ, ఫుట్‌వేర్‌, హోమ్‌నీడ్స్‌, షాపింగ్‌ మాల్స్‌ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. గతంలో దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతూ కనిపించేవి. రద్దీ దృష్ట్యా షాపులకు మంచి డిమాండ్‌ ఉండేది. కొంతకాలంగా పరిస్థితి మారిపోయింది. వ్యాపారాలు లేక షాపులు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ రోడ్డులోని కప్పల అప్పన్న సెంటర్‌ నుంచి రాజీవ్‌ చౌక్‌ సెంటర్‌ వరకు కేవలం 550 మీటర్ల పరిధిలో 20కు పైనే షాపులు ఖాళీగా కనిపిస్తున్నాయి.

సాక్షి, భీమవరం: జిల్లాలో ఆషాఢ మాసం, దసరా, దీపావళి, క్రిస్మస్‌, న్యూఇయర్‌, సంక్రాంతి, రంజాన్‌, పెళ్లిళ్ల సీజన్లలో రెడీమేడ్‌, ఫ్యాన్సీ, కిరాణా, బంగారం, హోమ్‌గూడ్స్‌ తదితర వాటిపై రూ.2 వేల కోట్లకు పైనే వ్యాపారం జరుగుతుందని అంచనా. చిన్న వ్యాపారులు సైతం ఆయా సీజన్లకు నెల ముందే ఢిల్లీ, ముంబై, చైన్నె తదితర నగరాల నుంచి స్టాకులు పెట్టుకునేవారు. కొంతకాలంగా మార్కెట్‌లో వినియోగదారుల రద్దీ లేక అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. అద్దెలు కట్టలేని పరిస్థితుల్లో నష్టాలతో నడపలేక కొందరు వ్యాపారాలను మూసివేస్తుండటంతో షాపులు ఖాళీ అవుతున్నాయి. ప్రధాన సెంటర్లలో సైతం షాపుల ముందు టు–లెట్‌ బోర్డులు కనిపిస్తున్నాయి.

బోణీలు కావు.. బేరాలు లేవు

భీమవరంలో బంగారం, వస్త్ర, ఫర్నిచర్‌, భవన నిర్మాణ తదితర వ్యాపారాలు మందకొడిగా సాగుతున్నాయి. రియల్‌ఎస్టేట్‌ డల్‌గా ఉంది. భీమవరం ఇండస్ట్రీయల్‌ ఏరియాలో పలు రకాల వస్తువులు తయారీ జరుగుతున్నా బిజినెస్‌ అంతంతమాత్రమే అని వ్యాపారులు అంటున్నారు.

ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పట్టణంలో పాటు, కాళ్ల, ఉండి, పాలకోడేరు మండలాల్లో మార్కెట్‌ ఒడిదుడుకులతో కొట్టుమిట్టాడుతుంది. వ్యాపారాలు లేక అద్దెలు చెల్లించడం కష్టమవుతోందని చిరువ్యాపారుల నుంచి పెద్ద వ్యాపార సంస్థల యజమానులు వాపోతున్నారు.

బంగారం వరక్తకానికి పేరొందిన నరసాపురంలో పెళ్లిళ్ల సీజన్‌లోనూ అమ్మకాలు లేవని బులియన్‌ వర్తకులు పేర్కొంటున్నారు. కిరాణా, వస్త్రా వ్యా పారం డల్‌గా సాగుతున్నాయి. మరోపక్క తమ వ్యాపారాలు కూడా సగానికిపైగా పడిపోయా యని ఫుట్‌పాత్‌ వ్యాపారులు వాపోతున్నారు.

వస్త్ర, ఫ్యాన్సీ, కిరాణా, గోల్డ్‌ తదితర వ్యాపారాలకు పేరొందిన పాలకొల్లులోని బస్టాండ్‌ సెంటర్‌, టెంపుల్‌రోడ్డు, తాడేపల్లిగూడెంలోని కేఎన్‌ రోడ్డు, తాలుకా ఆఫీస్‌ రోడ్లు జనం లేక వెలవెలబోతున్నాయి.

ప్రజల దగ్గర డబ్బుల్లేక మార్కెట్‌లో మనీ రొ టేషన్‌ తగ్గడం వ్యాపారాలపై ప్రభావం చూపిందని, గతంతో పోలిస్తే 60 శాతం వ్యాపారం తగ్గినట్టు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఉదయం షాపు తెరిస్తే మధ్యాహ్యానికి బోణి కావడం కష్టమవుతోంది. ఇటువంటి గడ్డు పరిస్థితులు ఎన్నడూ లేవు. ఇప్పటికే చాలా మంది వ్యాపా రులు దివాలా తీసి షాపులు మూసివేశారు. జనం వద్ద డబ్బులు లేవు అనే సమాధానమే వస్తోంది.

– జల్లూరి జగదీష్‌, రెడీమేడ్‌ వస్త్ర వ్యాపారి, తణుకు

ఇటీవల వ్యాపారులు అస్సలు సరిగా సాగడం లేదు. వేసవిలో పండ్ల వ్యాపారం బా గుంటుంది. అయితే ఈ ఏడాది వ్యాపారమే సాగలేదు. జనం దగ్గర డబ్బులు లేవు. ఇలాగైతే వ్యాపారం చేయడం కష్టం. అప్పులు చేసి బతకాల్సిందే.

– తోట శ్రీను, పండ్ల వ్యాపారి, నరసాపురం

రాష్ట్రంలో నిర్మాణ రంగం నెమ్మదించడంతో సిమెంట్‌, ఐరన్‌, గ్రానైట్‌, టైల్స్‌ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండటంతో షాపుల అద్దెలు చెల్లించేందుకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

– తరగళ్ల సురేష్‌, గ్రానైట్‌ వ్యాపారి, చినఅమిరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement