తల్లికి ఎగనామం | - | Sakshi
Sakshi News home page

తల్లికి ఎగనామం

Jul 19 2026 12:50 AM | Updated on Jul 19 2026 12:50 AM

తగ్గిన భక్తుల రద్దీ

నియోజకవర్గాల వారీగా తల్లికి వందనం

న్యూస్‌రీల్‌

నీకు.. 15, నీకు.. 15, నీకు.. 15 అంటూ..

తగ్గిన భక్తుల రద్దీ
ద్వారకాతిరుమల: చిరుజల్లుల ప్రభావంతో చినవెంకన్న క్షేత్రానికి శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత వారాలతో పోలిస్తే తక్కువ మంది భక్తులు వచ్చారు.

ఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026

భీమవరం: విద్యకు పెద్దపీట వేస్తామని చెబుతున్న కూటమి ప్రభుత్వం ఈ ఏడాది తల్లికి వందనం పథకంలో భారీగా కోత విధించినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధనతోపాటు మనబడి నాడు–నేడు పథకం ద్వారా పాఠశాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించి ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూల్స్‌కు ధీటుగా సర్వాంగసుందరంగా తయారుచేయించారు. అంతేగాకుండా పేద విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ఏటా స్కూల్స్‌ తెరచిన వెంటనే అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థులకు రూ.15 వేలు ఆర్థిక సహాయాన్ని విద్యార్థుల తల్లుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయించారు.

ఏమార్చి.. రూ.85 కోట్లు ఎగ్గొట్టి..

జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 1,376 ప్రభుత్వ, 514 ప్రైవేట్‌ పాఠశాలలున్నాయి. వీటిలో దాదాపు 2.50 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు అంచనా. వీరికి దాదాపు రూ.375 కోట్లు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం లెక్కల ప్రకారం ఈ ఏడాది జిల్లాలో సుమారు 2.24 లక్షల మంది విద్యార్థులను అర్హులుగా నిర్ధారించి వీరికి రూ.290 కోట్లు మాత్రమే మంజూరుచేశారు. వాస్తవంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున విద్యార్థుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయాల్సిన సొమ్ము రూ.336 కోట్లుగా చెబుతున్నారు. జిల్లా మొత్తం మీద దాదాపు రూ.50 కోట్లు పాఠశాలల్లో టాయిలెట్స్‌ శానిటేషన్‌ కోసం ప్రభుత్వం కోత విధించనుందని తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. విద్యార్థుల సంఖ్యలో కోత విధించడమేగాక ఇచ్చే మొత్తంలో రూ.2 వేల చొప్పున మినహాయించడం దారుణమని మండిపడుతున్నారు. గత ప్రభుత్వం ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలోనే నిధులు జమచేయగా కూటమి ప్రభుత్వం ప్రస్తుతం నెల రోజులు గడిచిపోయినా నిధులు జమచేయలేదని అంటున్నారు. కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కరి రూ.15 వేల చొప్పున జమచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

నియోజకవర్గం విద్యార్థులు లబ్ధి రూ.కోట్లలో..

భీమవరం 33,109 42.76

ఆచంట 28,851 37.45

నరసాపురం 27,516 35.64

పాలకొల్లు 28,444 36.89

తాడేపల్లిగూడెం 31,118 40.29

తణుకు 33,368 43.2

ఉండి 33,938 43.98

గణపవరం మండలం 7,612 9.87

మొత్తం 2,23,956 290.09

2024 ఎన్నికల సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ ఏటా రూ.15 వేల చొప్పున తల్లికి వందనం పథకం ద్వారా చెల్లిస్తామని కూటమి నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రాష్ట్ర జలవనరుశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీకు.. 15, నీకు.. 15, నీకు.. 15 వేలంటూ ఎన్నికల్లో ప్రచారం ఊదరగొట్టారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ప్రచారాన్ని నమ్మి ఓట్లు వేసిన విద్యార్థులకు కూటమి అధికారం చేపట్టిన మొదటి సంవత్సరం తల్లికి వందనం పథకం ఎగ్గొట్టి తరువాత సంవత్సరం కొంతమంది విద్యార్థులకు కేవలం రూ.13 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది.

కోతల వందనం

తల్లికి వందనంలో కోత

ఇవ్వాల్సింది రూ.375 కోట్లు.. ఇస్తామంటోంది రూ.290 కోట్లు

జిల్లాలో విద్యార్థులు 2.50 లక్షలు

అర్హులుగా తేల్చింది 2.24 లక్షలే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement