పోక్సో కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

పోక్సో కేసు నమోదు

Jul 19 2026 6:47 AM | Updated on Jul 19 2026 6:47 AM

పోక్సో కేసు నమోదు ‘సాక్షి’ భాస్కర్‌కు అశ్రునివాళి

ఉండి: మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడటంతో, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికను అదే గ్రామానికి చెందిన గుబ్బల హేమంత్‌కుమార్‌ ప్రేమ పేరుతో వేధించాడు. గత మే నెలలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడి, ఈ విషయాన్ని ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించాడు. హైదరాబాద్‌లో చదువుకునేందుకు వెళ్లిన బాలిక, వారం రోజుల క్రితం తిరిగి గ్రామానికి వచ్చింది. యువకుడి వేధింపులు మళ్లీ మొదలవ్వడంతో, పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సై హనుమంతు మల్లికార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొయ్యలగూడెం (జంగారెడ్డిగూడెం): జంగారెడ్డిగూడెం ప్రాంత ప్రజల గొంతుకగా నిలిచిన సీనియర్‌ జర్నలిస్ట్‌, శ్రీసాక్షిశ్రీ పత్రిక రిపోర్టర్‌ ధనిశెట్టి వెంకట భాస్కరరావు (59) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. శుక్రవారం ఆయన భౌతికకాయం వద్ద ఏపీయూడబ్ల్యూజే నాయకులు, సాక్షి పాత్రికేయులు, తోటి జర్నలిస్టులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భాస్కర్‌ ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు ప్రస్తుతం రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడిగా కొనసాగుతున్నారు. శుక్రవారం ఆయన అంతిమ యాత్రలో వైఎస్సార్‌సీపీ నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు, ప్రభుత్వ అధికారులు, పట్టణ ప్రముఖులు, ఏపీయూడబ్ల్యూజే నాయకులు, విలేకరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement