కార్యకర్తలకు అండగా జగన్‌ 2.0 యాప్‌ | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు అండగా జగన్‌ 2.0 యాప్‌

Jul 20 2026 1:32 AM | Updated on Jul 20 2026 1:32 AM

మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు

పెనుగొండ: వైఎస్సార్‌ సీపీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉండేందుకు జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ను పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించారని వైఎస్సార్‌ సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. జగన్‌ 2.0 యాప్‌ను, పోస్టర్లను ఆదివారం తూర్పుపాలెంలో వైఎస్సార్‌ సీపీ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్‌ సీపీ నాయకులను, కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. బాధితులు నేరుగా యాప్‌ డిజిటల్‌ డైరీ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, బాధితులకు అండగా పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కూటమి పాలనలో ఇసుక, మట్టి మాఫియాలు చెలరేగిపోతున్నాయని, అక్రమార్జనకు పాల్పడుతూ ప్రభుత్వ వనరులను దోచేస్తున్నారని విమర్శించారు. ఆచంట నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలకు అంతే లేకుండా పోయిందన్నారు. దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. అక్రమ తవ్వకాలను ప్రశ్నిస్తే వేధింపులు, కేసులు పెట్టారని, ఇ టువంటి సంఘటనలను జగన్‌ 2.0 యాప్‌ ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లవచ్చన్నారు. కార్యకర్తలు, నాయకులు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసు కోవాలని సూచించారు. పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు ఎంపీపీలు పూతినీడి వెంకటేశ్వరరావు (పెద్ద), కర్రి వెంకట నారాయణ రెడ్డి (వాసు), సబ్బితి సుమంగళి, పోడూరు, పెనుమంట్ర జెడ్పీటీసీలు గుంటూరి పెద్దిరాజు, కర్రి గౌరీ సుభాషిణి, పెనుగొండ, ఆచంట, పెనుమంట్ర మండల కన్వీనర్లు నల్లిమిల్లి వేణు ప్రతాపరెడ్డి(బాబీ రెడ్డి), జక్కంశెట్టి శ్రీరామ్‌, గూడూరి దేవేంద్రుడు, పార్టీ నా యకులు కర్రి వేణుబాబు, మేడచర్ల పండు, చంటిరాజులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement