తణుకు అర్బన్: ‘వ్యాధుల కాలం తస్మాత్ జాగ్రత్త’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురించిన కథనానికి మున్సిపల్ శానిటరీ అధికారులు స్పందించారు. తణుకు రాష్ట్రపతి రోడ్డులోని డ్రెయినేజీల్లో చెత్త, మురుగును తొలగించి శుభ్రం చేశారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఉండి: పోక్సో కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 16 ఏళ్ల బాలికను ప్రేమపేరుతో వంచించి మోసగించిన కేసులో పాందువ్వకి చెందిన గుబ్బల హేమ్‌కుమార్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించామని పోలీసులు తెలిపారు. కోర్టు రిమాండ్ విధించిందన్నారు.


