శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

Jul 20 2026 1:32 AM | Updated on Jul 20 2026 1:32 AM

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి 2న బాడీ బిల్డింగ్‌ పోటీలు నేడు పీజీఆర్‌ఎస్‌

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి ఆదివారం సందర్శించారు. కుటుంబసమేతంగా విచ్చేసిన ఆయనకు ముందుగా దేవస్థానం అధికారులు, అర్చకులు తూ ర్పు రాజగోపురం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రదక్షిణల అనంతరం ఆయన స్వా మి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలకగా, దేవస్థానం ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. న్యాయమూర్తి వెంట జిల్లా జడ్జి ఎస్‌.శ్రీదేవి, భీ మడోలు కోర్టు జడ్జి ఎస్‌.ప్రియదర్శిని నూతక్కి తదితరులు ఉన్నారు.

భీమవరం : న్యూ ఆంధ్ర బాడీబిల్డర్స్‌ అసో సియేషన్‌ ఆధ్వర్యంలో వచ్చేనెల 2న భీమవరం వీరమ్మపార్కు వద్ద చాంపియన్‌ ఆఫ్‌ ది చాంపియన్‌ బాడీ బిల్డింగ్‌ పోటీలు నిర్వహించనున్న ట్టు అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ ఖాసీం తెలిపారు. ఆదివారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో పోటీల బ్రోచర్‌ను డీఎస్పీ రఘువీర్‌విష్ణు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఖాసీం మాట్లాడుతూ పశ్చిమగోదావరి, ఏ లూరు, కృష్ట్యా జిల్లాల క్రీడాకారులు పాల్గొంటారన్నారు. రఘువీర్‌ విష్ణు మాట్లాడుతూ బా డీబిల్డింగ్‌ శరీర సౌష్టవంతో పాటు క్రమశిక్షణ కు దోహదం చేస్తుందన్నారు. అసోసియేషన్‌ జి ల్లా చైర్మన్‌ దాసి వరప్రసాద్‌ బాబు, వైస్‌ ప్రెసిడెంట్‌ పెన్మెత్స రవివర్మ, పి.అమూల్యరావు, అ ల్లు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌) : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం సో మవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు డివిజన్‌, మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. అలాగే రెవెన్యూ స మస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమం కూడా నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఆన్‌లైన్‌లోనూ అర్జీలు నమోదు చేసుకోవచ్చని, టో ల్‌ఫ్రీ నంబర్‌ 1100ను సంప్రదించవచ్చని ఆమె సూచించారు. నడవలేని, మంచా నికే పరిమితమైన, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పీజీఆర్‌ఎస్‌ కేంద్రాల వ ద్దకు తీసుకురావద్దని, సమస్యలను కుటుంబ సభ్యులు లేదా ప్రతినిధుల ద్వారా తెలియజేయవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement