భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక డీమార్ట్ ఎదురుగా స్వప్న వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల మహోత్సవంలో భాగంగా కలశాలతో ఊరేగింపు నిర్వహించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా లోక్ అదాలత్ నిర్వహించినట్టు జిల్లా న్యాయసేవాధికార సంస్ధ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలిపారు. శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో 38 చెక్‌బైన్స్ కేసులు పరిష్కారమయ్యాయని, రూ. 1,59,85,914లు ఫిర్యాదుదారులకు చెల్లించామన్నారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు తమ కేసులను సత్వరంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని న్యాయపరమైన వివాదాల నుంచి విముక్తి పొందవచ్చన్నారు. గత శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌తో పాటు ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌ను విజయవంతం చేయడంలో సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
విశాఖ స్పోర్ట్స్: విశాఖలోని అక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 11వ రాష్ట్ర అంతర్ జిల్లాల సబ్‌జూనియర్, జూనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ శనివారం ప్రారంభమైంది. కేటగిరీ–2 బాలుర 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో ఏలూరుకు చెందిన స్వామినాయుడు విజేతగా నిలిచారు.


