తాడేపల్లిగూడెం: వైఎస్సార్‌సీపీ నాయకత్వం, కార్యకర్తలకు మధ్య అనుసంధాన వేదిక జగన్ 2.0 సూపర్ యాప్ అని వైఎస్సార్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ వడ్డి రఘురాం అన్నారు. శనివారం సవితృపేటలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో యాప్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తూ, అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తోందన్నారు. కూటమి కుట్రలను తిప్పికొడుతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు, నాయకులకు మధ్య అనుసంధానంగా ఉండాలనే సదుద్దేశంతో జగన్ 2.0 సూపర్ యాప్ ఏర్పాటుచేశారన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అందరూ డౌన్‌లోడ్ చేసుకోవాలి
కాళ్ల: జగనన్న 2.0 సూపర్ యాప్‌ను పార్టీ శ్రేణులంతా తమ సెల్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవాలని ఉండి నియోజకవర్గ పార్టీ కన్వీనర్ పీవీఎల్ నర్సింహరాజు పిలుపునిచ్చారు. శనివారం ఆయన యాప్ పోస్టర్లను ఆవిష్కరించారు. పార్టీ సమాచారాన్ని, కార్యక్రమాలను డిజిటల్ రూపంలో క్షేత్రస్థాయికి వేగంగా తీసుకెళ్లేందుకు యాప్ దోహదపడుతుందన్నారు. ఎవరెవరు, ఎక్కడెక్కడ ఏఏ కార్యక్రమాలు చేస్తున్నారన్నది సులభంగా తెలుసుకోవడంతో పాటు పార్టీ బలోపేతానికి యాప్ ఉపయోగపడుతుందన్నారు. ఆకివీడు, ఉండి, పాలకోడేరు మండలాల పార్టీ కన్వీనర్లు నంద్యాల సీతారామయ్య, పెనుమత్స ఆంజనేయరాజు, సీహెచ్ పాపారావు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అంబటి రమేష్, ఉండి జెడ్పీటీసీ రణస్థుల మహంకాళి, ఉండి ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.


