జోరు జోరుగా.. హుషారుగా.. కాంగ్రెస్‌! | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ జోష్‌..

Aug 8 2023 6:10 AM | Updated on Aug 8 2023 12:36 PM

- - Sakshi

వికారాబాద్‌: రాష్ట్రమంతా కాంగ్రెష్‌ జోష్‌ ఉందని.. కార్యకర్తలంతా పార్టీ గెలపుకోసం కలిసికట్టుగా పని చేయాలని డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ బూత్‌ కో ఆర్డినేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ బలంగా ఉన్నందున అధికార పార్టీ నేతలు సైతం హస్తం గూటికి చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ సాధించిన గెలుపు వ్యూహమే మన రాష్ట్రంలో అమలు చేస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు మరింత శ్రద్ధతో పని చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో పలు సంస్థలు నిర్వహించిన సర్వేలతో పాటుగా అధికార పార్టీ సర్వేలోనూ పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గెలవడం ఖాయమే ప్రచారం జోరుగా సాగుతోందన్నారు. బూత్‌ కోఆర్డినేటర్స్‌ ఎన్నికల ప్రక్రియను తెలుసుకోవడంతో పాటుగా క్షేత్రస్థాయిలో సైతం ఓటు వేసే విధానాల గురించి వివరించాలన్నారు. అనంతరం గద్దర్‌ మృతికి సంతాపం తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి గోపాల్‌ నాయక్‌, మాజీ ఎంపీపీ అంజిలయ్య, యువజన విభాగం అధ్యక్షుడు జంగయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మి, పార్టీ ప్రధాన కార్యదర్శులు యాదయ్య, సత్యనారయణ, కుల్కచర్ల ఎంపీటీసీ సభ్యుడు ఆనందం, ఎస్టీ సెల్‌ మండల అధ్యక్షుడు రాంచందర్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు మహేశ్‌, మండల ఉపాధ్యక్షుడు హరినాథ్‌ రెడ్డి, పార్టీ మీడియా కోఆర్డినేటర్స్‌ భాస్కర్‌, భరత్‌ కుమార్‌ రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement