విద్యార్థుల్లేక.. మూతబడి గొల్లగూడలో గ్రామంలో విద్యార్థుల కొరత కారణంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మూతపడింది.
కొడంగల్ రూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. మంగళవారం ఆయన పట్టణంలోని కడా కార్యాలయంలో కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, దుద్యాల మండలాల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుడిసెల్లో నివసిస్తున్న వారి గుర్తింపునకు ప్రత్యేక సర్వే చేపట్టి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్క కుటుంబం కూడా సర్వేలో మిగిలిపోకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించాలన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ జాబితాలను సిద్ధం చేయాలన్నారు. అనంతరం కొడంగల్‌లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టుర్, జెడ్పీ సీఈఓ సుధీర్, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, హౌసింగ్ పీడీ ముక్రమ్‌బాబా, మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్, ఎంపీడీఓ ఉషశ్రీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలందించాలి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు వైద్యులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 220 పడకల ఆస్పత్రి సమావేశం హాలులో జిల్లాలోని ఆస్పత్రుల వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పాము, కుక్క కాటుకు మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
త్వరితగతిన వైద్యం చేయాలి: ఎమ్మెల్యే
ప్రభుత్వ ఆస్పత్రులను దేవాలయాలుగా భావిస్తూ రోగులకు త్వరితగతిన వైద్య సేవలందించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. తాండూరు మెడికల్ కళాశాల రెండేళ్ల అనంతరం హకీంపేటకు తరలిస్తారని అప్పటి వరకు తాండూరులోనే కొనసాగుతుందని స్పష్టత ఇచ్చారు.
సెప్టెంబర్‌లో ప్రారంభించాలి: నందారం
220 పడకల ఆస్పత్రిని సెప్టెంబర్ చివరి వరకు అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్‌కుమార్ అన్నారు. కొడంగల్ ఆస్పత్రికి వచ్చే రోగులను తాండూరు, వికారాబాద్ ఆస్పత్రులకు రిఫర్ చేయంకుడా అన్ని వసతులు, సౌకర్యాలు, వైద్య సిబ్బంది, పరికరాలు సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్స్‌పాల్ రాజు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి, టీడీఆర్‌ఐ ఎంఏ ప్రెసిడెంట్ జయప్రసాద్, టీజీఎంఈ ఐడీసీ ఈఈ రామ్మోహన్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ సుధాకర్‌లాల్, ఆర్‌ఎంఓలు సునీల్, రవీంద్రయాదవ్, పీహెచ్‌సీ సూపరింటెండెంట్ చంద్రప్రియ, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఆనంద్, డాక్టర్ పద్మ సాకేత్ పాల్గొన్నారు.
ఎకోపార్కు పనుల పరిశీలన
బొంరాస్‌పేట్: కొడంగల్ రేంజ్ పరిధిలోని బొంరాస్‌పేట్‌లో ఏర్పాటు చేస్తున్న ఏకో పార్క్ పనులను మంగళవారం కలెక్టర్ దీపక్‌తివారి పరిఽశీలించారు. ఈ పార్క్‌కు రూ.5.65 కోట్ల నిధులు మంజూరవగా.. ఇప్పటి వరకు రూ.40లక్షలు మాత్రమే ఖర్చు చేశారని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. దీంతో ఆయన పనులను వేగిరం చేయాలని సూచించారు. ఆయన వెంట కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, వికారాబాద్ అటవీ శాఖ అధికారి విశాల్, బాత్తుల, ఐఎఫ్‌ఎస్ విజయ్ కుమార్, కొడంగల్ ఎఫ్‌ఆర్‌ఓ రమేశ్, బొంరాస్‌పేట్ ఎఫ్‌ఎస్‌ఓ కార్తీక్ రెడ్డి ఉన్నారు.
కలెక్టర్ దీపక్‌తివారి


