31న అథ్లెటిక్స్‌ సెలక్షన్స్‌ | - | Sakshi
Sakshi News home page

31న అథ్లెటిక్స్‌ సెలక్షన్స్‌

Jul 30 2026 7:30 AM | Updated on Jul 30 2026 7:30 AM

31న అథ్లెటిక్స్‌ సెలక్షన్స్‌ జూనియర్‌ కళాశాల భవన నిర్మాణం పూర్తి చేయాలి వేతనాల పెంపునకు వినతి గడువులోపు సర్‌ను పూర్తి చేయండి

తాండూరు టౌన్‌: వికారాబాద్‌ జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన తాండూరులో బాలబాలికలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు, సెలక్షన్స్‌ నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు రాములు, రాము మంగళవారం ఓసంయుక్త ప్రకటనలో తెలిపారు. తాండూరులోని పాత శాలివాహన మైదానంలో సబ్‌ జూనియర్స్‌, జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాల్లో ఉదయం 8.30 గంటలకు ఈ పోటీలు ప్రారంభమవుతాయన్నారు. బాలబాలికలకు అండర్‌ 6, 8, 10, 12 విభాగాల్లో 60 మీటర్లు, 150, 200, 300, 400ల మీటర్ల రన్నింగ్‌ పోటీలు, బ్రాడ్‌ జంప్‌, లాంగ్‌ జంప్‌, అండర్‌ 14, 16, 20 విభాగాల్లో జావెలిన్‌ త్రో, అండర్‌ 18 విభాగంలో రన్నింగ్‌, జంపింగ్‌, త్రోయింగ్‌ పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తహసీల్దార్‌చే జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. వివరాలకు 99513 43432, 63000 75229 నంబర్లలో సంప్రదించాలన్నారు.

సీఆర్‌పీఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ శివరాజ్‌

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవన నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసి తాగునీటి వసతి కల్పించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక(సీఆర్‌పీఎఫ్‌) జిల్లా కన్వీనర్‌ శివరాజ్‌ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన అదనపు కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం కళాశాలకు భవనం మంజూరైనప్పటికీ నేటికీ నిర్మాణం పూర్తి చేయలేదన్నారు. గతేడాది కలెక్టర్‌ చొరవ తీసుకుని అయిదు గదులు పూర్తిచేయించారన్నారు. కళాశాలలో వసతులు లేక 600 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికై నా స్పందించి కళాశాలలో సమస్యలు లేకుండా చూడాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సీఆర్‌పీఎఫ్‌ ఉపాధ్యక్షుడు నాగరాజ్‌, శ్రీనివాస్‌ ఉన్నారు.

తాండూరు టౌన్‌: మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల జీతాలు పెంచాలని తెలంగాణ మున్సిపల్‌ స్టాఫ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈమేరకు మంగళవారం ఆయన సంఘం సభ్యులతో కలిసి మున్సిపల్‌ కమిషనర్‌ రాకేశ్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపల్‌ కార్మికులు పేదరికంలో మగ్గుతున్నారని, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా వారి జీతాలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో సంఘం తాండూరు ప్రధాన కార్యదర్శి పి.నర్సింలు, నాయకులు అశోక్‌, లాలప్ప, వెంకటేశ్‌, వెంకటప్ప తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్‌

మర్పల్లి: సర్‌ ప్రక్రియను గడువు లోపు పూర్తి చేయాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్‌ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కట్‌మర్పల్లి గ్రామంలో బూత్‌ లెవల్‌ అధికారులు చేపడుతున్న ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం సర్పంచ్‌ అధక్షతన గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన సమీక్షలో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరు తప్పని సరిగా సర్‌ ఫారం పూర్తి చేసి సంబంధిత బూత్‌ లెవల్‌ అధికారులకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు సురేష్‌, నాయకులు రాములుయాదవ్‌, మహేష్‌, బూత్‌ లెవల్‌ పార్టీ శ్రేణులు, అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement