బాలికల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి | A thorough inquiry should be conducted into the death of the girls | Sakshi
Sakshi News home page

బాలికల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి

Feb 7 2024 4:19 AM | Updated on Feb 7 2024 4:19 AM

A thorough inquiry should be conducted into the death of the girls - Sakshi

సాక్షి, యాదగిరిగుట్ట/భువనగిరి: ఇటీవల భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన ఇద్దరి విద్యార్థినుల అనుమానాస్పద మృతిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు.

భువనగిరి పట్టణంలోని ఎస్సీ హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థినులు భవ్య, వైష్ణవి ఆత్మహత్య చేసుకున్న గదిని మంగళవారం ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ... విద్యార్థినులు ఇద్దరూ ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్నారని, ఆ భవనం పరిసరాలు, గదిలో లభించిన సూసైడ్‌నోట్‌ అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు.

హాస్టల్‌లోకి బయట నుంచి అదనంగా వ్యక్తులు వచ్చినట్లు చెబుతున్నారని, ఈ విషయంలో పోలీసు విచారణ పారదర్శకంగా ఉండాలని కోరారు. ‘మా డిమాండ్‌కు స్పందించి...ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు’అని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement