breaking news
girls death
-
బాలికల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి
సాక్షి, యాదగిరిగుట్ట/భువనగిరి: ఇటీవల భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన ఇద్దరి విద్యార్థినుల అనుమానాస్పద మృతిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. భువనగిరి పట్టణంలోని ఎస్సీ హాస్టల్లో పదో తరగతి విద్యార్థినులు భవ్య, వైష్ణవి ఆత్మహత్య చేసుకున్న గదిని మంగళవారం ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ... విద్యార్థినులు ఇద్దరూ ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్నారని, ఆ భవనం పరిసరాలు, గదిలో లభించిన సూసైడ్‌నోట్ అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు. హాస్టల్లోకి బయట నుంచి అదనంగా వ్యక్తులు వచ్చినట్లు చెబుతున్నారని, ఈ విషయంలో పోలీసు విచారణ పారదర్శకంగా ఉండాలని కోరారు. ‘మా డిమాండ్‌కు స్పందించి...ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు’అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. -
ట్రాక్టర్ ట్రాలీ బోల్తా ఆరుగురి మృతి
పట్నా: ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడి ఆరుగురు బాలికలు మృతి చెందిన ఘటన బిహార్ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది. రాజస్తాన్ నుంచి టైల్స్ తీసుకువస్తున్న భారీ ట్రాలీ గోపాల్‌గంజ్ మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో అక్కడే ఆడుకుంటున్న ఆరుగురు బాలికలు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
సమతూకం తప్పుతోంది!
మన దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో ఐదేళ్లలోపు బాలికల మరణాలు అధికంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ప్రతి రెండు జిల్లాల్లో ఒక జిల్లాలో శిశు మరణాలు అత్యధికంగా ఉన్నట్టు ఈ పరిశోధనలో తేలింది. భారతదేశంలో ప్రతి యేడాది దాదాపు 2,39,000 మంది ఆడపిల్లలు లింగ వివక్ష కారణంగా మృత్యువు దరికి చేరుతున్నారంటే మన అభివృద్ధి అంకెలకూ దీనికీ లింకెక్కడా అనిపిస్తోంది! కారణాలేవైనా ఐదేళ్లు నిండకుండానే మన దేశంలో దాదాపు రెండున్నర లక్షల మంది ఆడపిల్లలు ‘అదృశ్యమై’పోతున్నారు. మగపిల్లవాడు కావాలనే కోరిక, ఆడపిల్ల పెంపకం ఉన్న భయ భావం, పురుషాధిపత్య భావజాలం.. పసిబిడ్డలను మొగ్గలోనే చిదిమేస్తోంది. ఆడపిల్లల భ్రూణ హత్యలు.. మళ్లీ వేరు లెక్కలవి. పుట్టిన తర్వాత కూడా! ఇప్పటివరకూ అంతా అనుకుంటున్నట్టు ‘‘లింగ వివక్ష ఆడపిల్లల పుట్టుకను నివారించే అబార్షన్లకు, ఆడపిల్లల భ్రూణ హత్యలకు మాత్రమే పరిమితం కాలేదనీ, ఆడపిల్ల పుట్టుక అనంతరం కూడా వారిని చంపేసే హేయమైన చర్యలు మన భారత దేశంలో కోకొల్లలని’’ ఈ పరిశోధనకు సహ అధ్యయనవేత్తగా ఉన్న పారిస్ డెస్కరేట్స్ యూనివర్సిటీ కి చెందిన గుయిల్‌మోటో అభిప్రాయపడ్డారు. ‘‘స్త్రీపురుష సమానత్వం కేవలం విద్యాహక్కు కోసమో, లేక సమాన ఉపాధి అవకాశాల కోసమో, లేదంటే రాజకీయ ప్రాతినిధ్యం కోసమో మాత్రమే కాదు, ఇది పిల్లల సంరక్షణకు, వాక్సినేషన్‌కీ, పౌష్టికాహారానికీ, మొత్తంగా వారి ఆరోగ్యానికి, చివరగా వారి ప్రాణాల పరిరక్షణకు సంబంధించిన విషయం’’ అని అంటారాయన.’’ మనం మరీ హీనం దేశంలోని ఐదేళ్లలోపు ఆడపిల్లల మరణాలను నివారించగలిగే 640 జిల్లాల్లో కేంద్రీకరించి చేసిన ఇలాంటి పరిశోధన గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా లింగ వివక్ష పాటించని దేశాల పరిస్థితులతో భారతదేశంలో కొనసాగుతోన్న ఐదేళ్లలోపు బాలికల మరణాలను పోల్చి చూశారు పరిశోధకులు. ఇందుకు గాను యునైటెడ్ నేషన్స్‌లోని 46 రాష్ట్రాలకు సంబంధించిన గణాంకాలను తీసుకొని భారతదేశ వాస్తవ పరిస్థితులను పోల్చి చూశారు. ఆయాదేశాలతో మన దేశంలోని ఐదేళ్ల లోపు బాలికల మరణాలను పోల్చి చూడగా ఎన్నో కఠోర వాస్తవాలు బయటపడ్డాయి. పేరుకే పెద్ద రాష్ట్రాలు మన దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో ఐదేళ్లలోపు బాలికల మరణాలు అధికంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ప్రతి రెండు జిల్లాల్లో ఒక జిల్లాలో శిశు మరణాలు అత్యధికంగా ఉన్నట్టు ఈ పరిశోధనలో తేలింది. 2000–2005 మధ్యకాలంలో 0–4 వయస్సు పిల్లల సగటు మరణాలు ప్రతి వెయ్యి మంది పిల్లల జననాలకీ 18.5 శాతంగా ఉంది. ఇది దాదాపు ప్రతి యేడాది మరణిస్తున్న పది లక్షలమందిలో పావు భాగం. దేశంలోని అతిపెద్ద రాష్ట్రాలున్న ఉత్తరాదిలో బాలికల మరణాలు ఎక్కువగా నమోదౌతున్నాయి. ఐదేళ్లలోపు బాలికల మరణాల్లో మూడింట రెండొంతుల మంది ఉత్తర భారతంలోనే మరణిస్తున్నారు. పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్, మ«ధ్యప్రదేశ్ రాష్ట్రాలు చిన్నారి బాలికల మరణాల్లో అగ్రభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజల్లో తక్కువ అక్షరాస్యత, అత్యధిక జనాభా, అధిక జననాలు ఈ లింగ వివక్షకి కారణంగా ఈ పరిశోధనలో తేలింది. సంపన్నులలోనూ వివక్ష ఈ సమస్య కేవలం పేద, నిరక్షరాస్యులైన ప్రజల్లోనే లేదు. మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి వారిలోనూ, చదువుకున్న వారిలో సైతం ఈ జాడ్యం వ్యాపిస్తోంది. మగపిల్లలే ఇంటి బాధ్యతను నెత్తిన మోస్తారనీ, ఆస్తికి వారసులనే తప్పుడు అభిప్రాయం కూడా దీనికి మరొక కారణం. నిజానికి ఉత్తర భారత దేశంలోని సంపన్న రాష్ట్రాలుగా భావిస్తోన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఆరేళ్ల వయస్సులోపు 1200 మంది బాలురకి 1000 మంది బాలికలే ఉంటున్నారు. మొత్తంగా ఈ పరిశోధనలో తేలిందేమిటంటే ప్రపంచంలోనే భారతదేశంలో సెక్స్ రేషియో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నదని. ‘నేరానికి’.. ప్రాధాన్యం ఈ యేడాది జనవరిలో భారత ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారమే ఆడపిల్లల భ్రూణహత్యలు, వ్యాధులు, నిర్లక్ష్యం, వివక్ష కారణంగా మన దేశంలో దాదాపు 63 మిలియన్ల మంది మహిళలు అదృశ్యమైపోయారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి యేడాదీ 20 లక్షల మంది ఆడపిల్లలు మిస్ అవుతున్నారని ఈ యేడాది జనవరిలో భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 2 కోట్ల 10 లక్షల మంది ‘అవాంఛిత’ బాలికలున్నట్టు భారత ప్రభుత్వం వెల్లడించింది. భారతదేశంలో నేరప్రవృత్తి పెరగడానికి మగపిల్లల ప్రాధాన్యత పెరగడం కూడా కారణమని భావిస్తున్నారు. మగపిల్లలు పుట్టే వరకూ కంటూనే ఉండడం కూడా దేశంలో ఓ దురాచారంలా మారిపోతోంది. ఇదే ఇప్పుడు ఈ దేశంలో సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో అభివృద్ధికి ఆటంకంగా తయారయ్యింది. – అరుణ -
మృతురాలి కుటుంబాన్ని కలవనున్న సీఎం
కదులుతున్న బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడి ఆపై తల్లీబిడ్డలను కిందకు తోసివేసిన దారుణ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఎట్టకేలకు స్పందించారు. మోగా జిల్లా నాలుగు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన సహించరానిదని, 16 ఏళ్ల బాలిక మరణం అత్యంత బాధాకరమన్నారు. మోగా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బైఠాయించిన మృతురాలి కుటుంబాన్ని స్వంయంగా వెళ్లి కలుస్తానని చెప్పారు. అకాలీదళ్ మాజీ మంత్రి అజైబ్ సింగ్ మాతృమూర్తికి శ్రద్ధాంజలి ఘటించేందుకు ఆదివారం పటియాలాకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే తమ కుటుంబానికి చెందిన 'ఆర్బిట్ ఏవియేషన్' రవాణా సంస్థ అనుమతుల రద్దుపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. మరోవైపు ఆసుపత్రివద్ద బైఠాయించిన మృతురాలి కుటుంబ సభ్యులకు మద్దతు తెలిపేందుకు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వ వ్యతికేర నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాలుగు రోజులుగా మోగా ఆసుపత్రి మార్చురీలోనే ఉన్న బాలిక మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు ఆమె తండ్రి అంగీకరించారని పోలీసులు ప్రకటించారు. కానీ పోలీసులు తమను ఒత్తిడి చేస్తున్నారని, రాజీ కుదుర్చుకోవాల్సిందిగా బలవంతం చేస్తున్నారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. బస్సు యజమానుదారుడైన డిప్యూటీ సీఎం, హోంమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కేసు నమోదుచేసి, ఆయనకు చెందిన ‘ఆర్బిట్ ఏవియేషన్’ సంస్థ రవాణా అనుమతులను రద్దు చేసేవరకు తమ పట్టు వీడబోమంటున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని బాలిక మృతి
కాకినాడ క్రైం : బైకును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఏడేళ్ల బాలిక మృతి చెందగా ఆమె తండ్రి, మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జగన్నాథపురం ఏటిమొగకు చెందిన రేకాడి నూకరాజు, కుమార్తె శ్రీదుర్గ (7), బంధువు వెంకటేష్ పెదపూడి మండలం అచ్యుతాపురత్రయంలో పెళ్లికి వె ళ్లి శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో తిరిగి వస్తుండగా జెడ్పీ సెంటర్ సర్కిల్ వద్ద బైకును ఆర్టీసీ బస్సు ఢీకొంది. బైకుపై నుంచి బస్సు వెళ్లడంతో శ్రీదుర్గ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ముగ్గురినీ కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా శ్రీదుర్గ అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు. నూకరాజు పరిస్థితి విషమంగా ఉంది. త్రీ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.