నేను జైలుకు వెళ్లేందుకే ఇలా చేస్తున్నా...
హైదరాబాద్, నాంపల్లి: ‘నాకు బయట రక్షణ లేదు. నేను జైల్లోనే సురక్షితంగా ఉంటా.. నన్ను జైలుకు పంపండి’ అంటూ ఓ రౌడీ షీటర్ హల్‌చల్ చేశాడు. హోటల్‌లో బీభత్సం సృష్టించి అరెస్టయ్యాడు. ఆగాపురాకు చెందిన షేక్ అస్లాం.. తనకు ప్రాణహాని ఉందని భయాందోళనకు గురయ్యాడు. ఎలాగైనా జైలుకు వెళ్లాలని భావించి మంగళవారం ఆగాపురాలోని ఓహోటల్‌కు వెళ్లి వంటపాత్రలు, గ్యాస్ సిలిండర్లను బయటకు విసిరేసి బీభత్సం సృష్టించాడు. అద్దాలను ధ్వంసం చేశాడు. నేను జైలుకు వెళ్లేందుకే ఇలా చేస్తున్నా అంటూ అరుస్తూ విధ్వంసానికి పాల్పడ్డాడు. హబీబ్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి అస్లాంను అదుపులోకి అరెస్టు చేశారు.


