breaking news
Habeeb nagar
-
'నన్ను జైలుకు పంపించండి..' హోటల్లో రౌడీ షీటర్ బీభత్సం!
హైదరాబాద్, నాంపల్లి: ‘నాకు బయట రక్షణ లేదు. నేను జైల్లోనే సురక్షితంగా ఉంటా.. నన్ను జైలుకు పంపండి’ అంటూ ఓ రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. హోటల్లో బీభత్సం సృష్టించి అరెస్టయ్యాడు. ఆగాపురాకు చెందిన షేక్ అస్లాం.. తనకు ప్రాణహాని ఉందని భయాందోళనకు గురయ్యాడు. ఎలాగైనా జైలుకు వెళ్లాలని భావించి మంగళవారం ఆగాపురాలోని ఓహోటల్‌కు వెళ్లి వంటపాత్రలు, గ్యాస్ సిలిండర్లను బయటకు విసిరేసి బీభత్సం సృష్టించాడు. అద్దాలను ధ్వంసం చేశాడు. నేను జైలుకు వెళ్లేందుకే ఇలా చేస్తున్నా అంటూ అరుస్తూ విధ్వంసానికి పాల్పడ్డాడు. హబీబ్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి అస్లాంను అదుపులోకి అరెస్టు చేశారు. -
ప్రియుడితో ఉండగా అకస్మాత్తుగా భర్త ప్రత్యక్షం, ఏం చేయాలో తోచక!
సాక్షి,నాంపల్లి: అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో ఓ వివాహిత కట్టుకున్న భర్తను కడతేర్చిన సంఘటన శనివారం హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం... మాన్గార్ బస్తీకి చెందిన హోటల్ కార్మికుడు రోషన్(23)కు అదే బస్తీకి చెందిన లతకు గత కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మగ పిల్లాడు ఉన్నారు. లతకు అదే బస్తీకి చెందిన యువరాజు(28) అనే యువకుడు పరిచయమయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. భర్త రోషన్ ఇంట్లో లేని సమయంలో యువరాజుతో లత సన్నిహితంగా ఉండేది. అలా కొన్ని రోజులు గడిచాక వీరి బంధానికి భర్త రోషన్ అడ్డువస్తున్నాడని భార్య గ్రహించింది. యువరాజు, లత శనివారం మధ్యాహ్నం ఏకాంతంగా ఇంట్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా భర్త ప్రత్యక్షం కావడంతో ఏం చేయాలో తోచక ప్రియుడు యువరాజుతో కలిసి కత్తితో పొడిచి చంపింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడివున్న రోషన్ మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితులను ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. క్లూస్ టీమ్ సిబ్బంది వచ్చి రక్త నమూనాలను సేకరించారు. ఇదిలా ఉండగా ప్రియుడు యువరాజ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యువతిపై మహిళ యాసిడ్ దాడి
విశాఖపట్నం: యువతిపై మరో మహిళ యాసిడ్ తో దాడి చేసిన ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది. హబీబ్ నగర్ లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ ఐస్ క్రీమ్ దుకాణంలో పనిచేస్తున్న రజిత అనే యువతిపై స్వప్న అనే మహిళ యాసిడ్ తో దాడి చేసింది. కస్టమర్ లా వచ్చి ఈ దాడికి పాల్పడింది. అయితే స్వప్న స్వల్ప గాయాలతో బయటపడింది. తన మాజీ ప్రియుడు సత్యనారాయణరెడ్డిని పెళ్లిచేసుకోబోతుందనే అక్కసుతో రజితపై స్వప్న దాడి చేసింది. నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్వప్న భర్త నుంచి విడిపోయి ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు.


