యువతిపై మహిళ యాసిడ్ దాడి | woman poured acid on another woman in visakhapatnam | Sakshi
Sakshi News home page

యువతిపై మహిళ యాసిడ్ దాడి

Dec 3 2014 3:13 PM | Updated on Aug 17 2018 2:10 PM

యువతిపై మరో మహిళ యాసిడ్ తో దాడి చేసిన ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది.

విశాఖపట్నం: యువతిపై మరో మహిళ యాసిడ్ తో దాడి చేసిన ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది. హబీబ్ నగర్ లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

ఓ ఐస్ క్రీమ్ దుకాణంలో పనిచేస్తున్న రజిత అనే యువతిపై స్వప్న అనే మహిళ యాసిడ్ తో దాడి చేసింది. కస్టమర్ లా వచ్చి ఈ దాడికి పాల్పడింది. అయితే స్వప్న స్వల్ప గాయాలతో బయటపడింది. తన మాజీ ప్రియుడు సత్యనారాయణరెడ్డిని పెళ్లిచేసుకోబోతుందనే అక్కసుతో రజితపై స్వప్న దాడి చేసింది.

నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్వప్న భర్త నుంచి విడిపోయి ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement