breaking news
aghapura
-
హైదరాబాద్ అఘాపూరా ప్రాంతంలో అగ్నిప్రమాదం
-
మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలను ప్రారంభించిన జగన్
నాంపల్లి: నగరంలోని ఆగాపురాలో మల్టీస్పెషాలిటీ దంతవైద్యశాల ప్రారంభమైంది. చంద్రావతీస్ పేరిట ప్రారంభమైన ఈ దంత వైద్యశాలను వైఎస్ఆర్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన ఆస్పత్రిలోని అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించారు. జగన్మోహన్రెడ్డి ఆగాపురా వస్తున్నారని తెలుసుకున్న కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆస్పత్రి వద్ద ఆయన కాన్వాయ్ దిగగానే కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఆయన కార్యకర్తలు, అభిమానులతో కరచాలనం చేశారు. మరికొందరు ఆయనతో కలిసి ఫొటోలు దిగారు. ఆస్పత్రి ఎమ్డీ డాక్టర్ శ్రీకాంత్, మెట్టు ప్రసాద్ కుటుంబసభ్యులు జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గోషామహాల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నేతలు మెట్టు రాఘవేంద్ర, మెట్టు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.