HYD: వరుస విషాదాలు.. గాలిపటాలు ఎగురవేస్తూ 9 మంది మృతి | Nine people Died to kite | Sakshi
Sakshi News home page

HYD: వరుస విషాదాలు.. గాలిపటాలు ఎగురవేస్తూ 9 మంది మృతి

Jan 16 2024 12:24 PM | Updated on Jan 16 2024 12:57 PM

Nine people Died to kite  - Sakshi

హైదరాబాద్: పండుగ వేళ నగరంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు గాలిపటాలు ఎగురవేస్తూ 7 మంది మృతి చెందారు. తాజాగా మంగళవారం మరో ఇద్దరు మృతి చెందారు. రహ్మత్ నగర్‌లో స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగరవేయడానికి వెళ్లిన కపిల్ దేవ్ (23) అనే యువకుడు ఐదంతస్తుల భవనంపై నుంచి ప్రమాదశాత్తూ కింద పడడంతో మృతి చెందాడు. మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగురు స్నేహితుల ప్రమేయంపై అనుమానంతో కుటుంబ సభ్యులు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు

యాప్రాల్ గాలిపటానికి మరొక  బాలుడు మృతి 
హైదరాబాద్ యాప్రాల్‌లో పతంగి ఎగరవేస్తూ భువన్ సాయి అనే బాలుడు భవనంపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. కాగా మంగళవారం ఒక్క రోజే ఇద్దరు మృతి చెందారు.

TS: ప్రాణాలు తీస్తున్న పతంగులు!

Advertisement
 
Advertisement
Advertisement