రేవంత్‌ ఫెయిల్యూర్‌ సీఎం | harish rao comments on revanth reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌ ఫెయిల్యూర్‌ సీఎం

Jun 28 2026 9:12 PM | Updated on Jun 28 2026 9:12 PM

harish rao comments on revanth reddy

సాక్షి,సిద్ధిపేట: సీఎం రేవంత్‌రెడ్డి గుప్పు మేస్త్రీ కాదు.. ముంపు మేస్త్రీ అని మాజీ మంత్రి హరీష్‌ రావు ఎద్దేవా చేశారు. సిద్ధపేటలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దద్దమ్మ ముఖ్యమంత్రి, ఫెయిల్యూర్‌ సీఎం రేవంత్.

రైతు బంధ మీద శాసన సభలో చర్చకు రేవంత్‌రెడ్డి సిద్ధమా?. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మా ప్రభుత్వంలో 92 లక్షల మెట్రిక్‌ టన్నున ధాన్యం కొన్నాం. 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నామని రేవంత్‌ చెప్పుకోవడం విచిత్రం.

ఈ రోజు ప్రతి రైతు కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని తలచుకుంటున్నారు.బీఆర్‌ఎస్‌ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్స్‌ను 12 కిలోమీటర్లు తవ్వింది. ఎస్‌ల్‌బీసీలో కార్మికులు చనిపోతే శవాలను కూడా బయటకు తీయలేకపోయారని విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement