పెళ్లి పేరుతో మోసం.. యువకుడి అరెస్ట్‌ | Man Used AI Images To Fake Army Identity, Duped Woman With Marriage Promise, More Details Inside | Sakshi
Sakshi News home page

పెళ్లి పేరుతో మోసం.. యువకుడి అరెస్ట్‌

Jul 3 2026 2:11 PM | Updated on Jul 3 2026 2:38 PM

Fraud Under The Guise Of Marriage Youth Arrested Hyderabad Crime News

హైదరాబాద్‌, నాగోలు: సోషల్‌ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని, ఏఐ ఫోటోలను ఉపయోగించి ఆర్మీ అధికారినని నమ్మిస్తూ ఓ యువతిని మోసం చేసిన వ్యక్తిని గురువారం నాగోలు పోలీసులు అరెస్టు చేశారు.

నాగోలు ఇన్‌స్పెక్టర్‌ మహమ్మద్‌ మక్బూల్‌ జానీ తెలిపిన మేరకు.. నాగోలు ఆనంద్‌నగర్‌కు చెందిన ఓ మహిళకు సోషల్‌ మీడియా ద్వారా శామీర్‌పేట్‌కు చెందిన ముకేరా గోవర్ధన్‌ (29) పరిచయమయ్యాడు. తాను భారత సైన్యంలో అధికారినని చెప్పి ఏఐ ఫోటోలను పంపి నమ్మించాడు. ఆ తరువాత ప్రేమ, పెళ్లి అంటూ మాయమాటలు చెప్పాడు.

ఈ క్రమంలో యువతితో సహజీవనం సాగించాడు. తండ్రి చికిత్స కోసం డబ్బు అవసరం ఉందని పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నాడు. ఆ తరువాత పెళ్లి గురించి నిలదీయగా బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు నాగోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా నిందితుడికి ఇప్పటికే వివాహం జరిగిన విషయం విచారణలో బయటపడింది. అంతేకాక, గత ఏడాది ఆల్వాల్‌కు చెందిన మరో మహిళను కూడా పెళ్లి పేరుతో మోసం చేసి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచి్చనట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement