జూలై ఒకటో తేదీ నుంచి రేషన్‌.. | Distribution Of Ration Rice To Ration Cardholders | Sakshi
Sakshi News home page

జూలై ఒకటో తేదీ నుంచి రేషన్‌..

Jun 29 2026 12:43 PM | Updated on Jun 29 2026 1:45 PM

Distribution Of Ration Rice To Ration Cardholders

ముగిసిన ముందస్తు రేషన్‌ కోటా

దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ

నల్గొండ జిల్లా, సూర్యాపేట: రేషన్‌ కార్డు దారులకు జూలై నెల కోటా బియ్యం అందించేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంటున్నది. ఏప్రిల్, మే, జూన్‌న్‌నెలల కోటా బియ్యాన్ని ఏప్రిల్‌లో ఒకేసారి పంపిణీ చేసిన విషయం విదితమే. తాజాగా జూలై నెలకు సంబంధించిన బియ్యం అందించేందుకు గానూ రేషన్‌న్‌దుకాణాల డీలర్లకు బియ్యం సరఫరా ప్రక్రియను ప్రారంభించారు. జూలై 1వ తేదీ నుంచి రేషన్‌ షాపుల ద్వారా బియ్యం అందించనున్నారు.

గోదాంల నుంచి డీలర్లకు..
సూర్యాపేట జిల్లాలో 3.50 లక్షలకు పైగా రేషన్‌ కార్డులు, 610 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా రేషన్‌కార్డు దారులకు అందించేందుకు  6వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమవుతాయి. ఈ మేరకు జిల్లాలోని గోదాంల నుంచి రేషన్‌ దుకాణాలకు సుమారు 2,400 మెట్రిక్‌ టన్నుల వరకు బియ్యాన్ని ఇప్పటికే సరఫరా చేశారు. సుమారు 40 శాతం వరకు బియ్యాన్ని దుకాణాలకు చేరవేశారు. ఈ నెల 30 నాటికి జూలై కోటాకు సంబంధించిన పూర్తిస్థాయి బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు అధికారులు అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement