నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి లక్ష పుష్పార్చన నిర్వహించారు. అమవాస్య సందర్భంగా నిద్రచేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈఓ మోహన్‌బాబు పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. గట్టుపైకి వాహనాలను అనుమతించలేదు. పూజల్లో ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సతీష్ శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్ శర్మ, ఆలయ చైర్మన్ వరాల రమేష్, సర్పంచ్ నేతగాని కృష్ణ, ఈఓ మోహన్‌బాబు, దేవాలయ డైరెక్టర్లు పాల్గొన్నారు.
గట్టు పైన నిద్ర చేస్తున్న భక్తులు


