Uppal: కారుతో ఢీకొట్టి మహిళ దారుణహత్య | Brutal Murder Of Woman In Uppal | Sakshi
Sakshi News home page

Uppal: కారుతో ఢీకొట్టి మహిళ దారుణహత్య

Jul 2 2024 11:05 AM | Updated on Jul 2 2024 11:10 AM

Brutal Murder Of Woman In Uppal

ఉప్పల్‌: కారుతో ఢీకొట్టి మహిళను ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి అర్వపల్లి ప్రాంతానికి చెందిన పెండేరి చంద్రమౌళి (47) ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో ఏజెంట్‌గా పనిచేస్తూ రామంతాపూర్‌ వివేక్‌నగర్‌లో నివాసముంటున్నారు. 

ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే ప్రాంతంలో నివాసముండే కొమ్మవారి మంజుల (37) చంద్రమౌళి పనిచేసే రియల్‌ ఎస్టేట్‌ సంస్థలోనే ఏజెంటుగా పనిచేస్తున్నారు. మంజుల భర్త నాలుగు నెలల క్రితం మృతిచెందారు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా మంజుల–చంద్రమౌళి మధ్య వివాహేతర సంబంధం ఉంది. గత కొంతకాలంగా మంజుల మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే చంద్రమౌళి మాట్లాడుకుందామంటూ మంజులను ఆదివారం రాత్రి ఉప్పల్‌ బగాయత్‌ లేఔట్‌లోకి తీసుకొచ్చాడు.

 ఇద్దరి మధ్య వాగి్వవాదం పెరిగింది. ఇంతలోనే మంజుల కారు దిగి వెళ్తుండగా చంద్రమౌళి వెనుక నుంచి అతి వేగంగా కారుతో ఆమెను ఢీకొట్డాడు. అంతటితో ఆగక పలుమార్లు ఆమెపై నుంచి కారును తీసుకెళ్లడంతో మంజుల అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం చంద్రమౌళి నేరుగా ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకోసం తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement