కొత్త జంట.. సెల్‌ఫోన్‌.. ప్రతిరోజూ 50 సార్లు ఐ లవ్‌ యూ.. విషాదం | - | Sakshi
Sakshi News home page

కొత్త జంట.. సెల్‌ఫోన్‌.. ఐ లవ్‌ యూ.. విషాదం

Jun 20 2023 1:42 AM | Updated on Jun 20 2023 2:05 PM

- - Sakshi

ఆదివారం ఉదయం సువిత భర్తకు ఫోన్‌ చేసింది. అతడు ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో

తమిళనాడు: భర్త ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదని మనస్తా పం చెందిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మృతిని జీర్ణించుకోలేక భర్తా ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి అయిన నెలరోజులు కూడా గడవకముందే నవ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ సంఘటన పట్టుకోట్టైలో జరిగింది. పట్టుకోట్టై సమీపంలోని నాటుచాల గ్రామానికి చెందిన సతీష్‌ (28)కు నెల రోజుల క్రితం సువిత (22)తో వివాహమైంది.

వారు ప్రతిరోజూ కనీసం 50 సార్లు ఐ లవ్‌ యూ అనే సందేశాన్ని పంపుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం సువిత భర్తకు ఫోన్‌ చేసింది. అతడు ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో మనస్తాపం చెందింది. మధ్యాహ్నం 3.45 గంటల ప్రాంతంలో తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది.

సతీష్‌ ఆమెను వెంటనే పట్టుకోట్టై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. భార్య మృతి చెందడంతో సతీష్‌ కూడా మనస్తాపం చెంది సోమవారం తెల్లవారుజామున 3.45 గంటలకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement