breaking news
Phone lift
-
కొత్త జంట.. సెల్‌ఫోన్.. ప్రతిరోజూ 50 సార్లు ఐ లవ్ యూ.. విషాదం
తమిళనాడు: భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదని మనస్తా పం చెందిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మృతిని జీర్ణించుకోలేక భర్తా ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి అయిన నెలరోజులు కూడా గడవకముందే నవ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ సంఘటన పట్టుకోట్టైలో జరిగింది. పట్టుకోట్టై సమీపంలోని నాటుచాల గ్రామానికి చెందిన సతీష్ (28)కు నెల రోజుల క్రితం సువిత (22)తో వివాహమైంది. వారు ప్రతిరోజూ కనీసం 50 సార్లు ఐ లవ్ యూ అనే సందేశాన్ని పంపుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం సువిత భర్తకు ఫోన్ చేసింది. అతడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మనస్తాపం చెందింది. మధ్యాహ్నం 3.45 గంటల ప్రాంతంలో తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. సతీష్ ఆమెను వెంటనే పట్టుకోట్టై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. భార్య మృతి చెందడంతో సతీష్ కూడా మనస్తాపం చెంది సోమవారం తెల్లవారుజామున 3.45 గంటలకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫోన్ లిఫ్ట్ చేస్తే ఖాతాలో నగదు మాయం
కాణిపాకం ఉద్యోగులే టార్గెట్ వారం రోజుల్లో పది మంది బాధితులు కాణిపాకం: కాణిపాకం వాసులకు పది రోజులుగా కంటి మీద కునుకులేకుండా పోతోంది. ఆలయ ఉద్యోగులే టార్గెట్‌గా అనామక వ్యక్తులు ఫోన్ చేస్తున్నారు. ఆ ఫోన్ లిఫ్ట్ చేయగానే వారి బ్యాంకు అకౌంట్లో నగదు మాయమైపోతోంది. ఇలా వారం రోజుల్లో దాదాపు పది మంది నగదు కోల్పోయారు. దేవస్థానం వద్ద పోలీసు స్టేషన్లో పనిచేసే ఒక అధికారికి ఇటీవల ఓ నంబరు నుంచి ఫోను వచ్చింది. ‘మేము ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నాము.. మీ అకౌంట్ నంబరు నిలిపివేయబడింది. పునరుద్ధరించుకోండి’ అంటూ అవతలి వ్యక్తి చెప్పారు. అకౌంట్ నంబర్.. ఏటీఎం నంబర్ చెప్పాల్సిందిగా కోరాడు. వివరాలు చెప్పిన కొద్ది సేపటికే ఆయన అకౌంట్ నుంచి డబ్బు వేరే అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ అయినట్లు మెసేజ్ వచ్చింది. అదేవిధంగా దేవస్థానంలోని శివాలయంలో పనిచేసే ఓ ప్రధాన అర్చకుడికి ఫోను వచ్చింది. పై వివరాలన్నీ చెప్పడంతో కొద్ది క్షణాల్లోనే రూ.30 వేలు అకౌంట్లో నుంచి తొలగిపోయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆయనకు గుండె ఆగినంత పనైంది. బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించి విషయం తెలియజేశారు. పరిశీలిస్తామని మేనేజర్ సమాధానం చెప్పారు. చదువురాని వారే టార్గెట్.. చదువురాని వారిని వారి మాటల ఆధారంగా అంచనా వేస్తారు. అటు పిమ్మట పూర్తి వివరాలను రాబడతారు. అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా తమపని కానిచ్చేస్తున్నారు. వీరు ప్రధానంగా డ్వాక్రా మహిళలు, ఉపాధి సిబ్బంది, గ్రామీణ మహిళలు, దుకాణాలు నిర్వహిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఫోన్ చేశారు... నగదు పోయింది సోమవారం ఉదయం 7 గంటలకు ఎస్బీహెచ్ మేనేజర్ రామచంద్రారెడ్డిని అంటూ 970906564 నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ ఖాతా నిలిపివేయబడింది. మీ ఖాతా నంబర్, ఏటీఎం కార్డు నంబర్, పిన్ నంబర్ చెప్పమని’ అడిగారు. తెలియజేశాను. 10 నిమిషాల్లోనే ఖాతాలోని నగదు పూర్తిగా మాయమైం ది. ఖాతాలో ఉన్న రూ.30 వేలు చోరీ చేశారు. – శేఖర్, కాణిపాకం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అడ్రస్ లేని నంబర్లతో ఫోన్ చేసి నగదు స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. కాణిపాకం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు, ఫైనాన్స్, లక్కీ డ్రా, లాటరీ సెంటర్ల నుంచి ఫోను చేస్తున్నట్లుగా చెబితే వివరాలు చెప్పొద్దు. అప్రమత్తంగా ఉండాలి. –ఎత్తిరాజులు, కాణిపాకం ఏఎస్ఐ