గొంతు కోసుకున్న యువకుడు
ఆంధ్రప్రదేశ్: నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ యువకుడు గొంతు కోసుకున్నాడు. దీంతో చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రక్తపు మడుగులో ఉన్న యువకుడిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, అతడు ఏ కారణంతో ఈ చర్యకు పాల్పడ్డాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com


