పొగాకు కొనుగోలు కేంద్రం సందర్శన
కొనుగోళ్ల పరిశీలన–రైతులతో ముఖాముఖి
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 5న తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్ల తీరును పరిశీలించడంతోపాటు ఆ రైతులతో నేరుగా మాట్లాడనున్నారు.
పర్యటనలో భాగంగా బుధవారం ఉ.9.30 గంటలకు వైఎస్ జగన్ తాడేపల్లిలో బయల్దేరి, ఉ.10.30కు దేవరపల్లి చేరుకుంటారు. అక్కడి పొగాకు కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న కొనుగోళ్లను పరిశీలిస్తారు. అనంతరం.. పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి, పంట సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, సమస్యలు తదితర అంశాలను నేరుగా వారిని అడిగి తెలుసుకుంటారు.


