గిరిజన చట్టాలు పకడ్బందీగా అమలు చేయండి | Tribals Hold Massive Protest Rally in Seetampet | Sakshi
Sakshi News home page

గిరిజన చట్టాలు పకడ్బందీగా అమలు చేయండి

Aug 4 2026 2:18 AM | Updated on Aug 4 2026 2:18 AM

Tribals Hold Massive Protest Rally in Seetampet

సీతంపేట ఐటీడీఏ వద్ద గిరిజనులతో కలిసి బైఠాయించి నిరసన తెలియజేస్తున్న మాజీ ఎమ్మెల్యే కళావతి, జడ శ్రావణ్‌ తదితరులు

సీతంపేట, ముంచంగిపుట్టులో గిరిజనుల భారీ ర్యాలీలు

సీతంపేట (పార్వతీపురం మన్యం)/ముంచంగిపుట్టు: జీవో నంబర్‌ 3ను పునరుద్ధరించాలని, 1/70 యాక్ట్‌తోపాటు అన్ని గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో, అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టులో సోమవారం గిరిజనులు భారీ ర్యాలీలు నిర్వహించారు. సీతంపేటలోని వారపు సంత నుంచి ఐటీడీఏ వరకు రెండు కిలోమీటర్ల మేర గిరిజనులు భారీ ర్యాలీగా తరలివచ్చారు. ఐటీడీఏ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా గిరిజనులకు మద్దతు తెలిపిన పాలకొండ వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మట్లాడుతూ జీవో నంబర్‌ 3ను పునరుద్ధరిస్తామని ఎన్నికల ముందు అరకు సభలో హామీ ఇచ్చి, మేనిఫెస్టోలో పెట్టిన సీఎం చంద్రబాబు... అధికారంలోకి వచ్చాక జీవో నంబర్‌ 3ను పునరుద్ధరించడం సాధ్యం కాదని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. హైకోర్టు అడ్వొకేట్‌ జడ శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో గిరిజనులకు చెందిన 1.23 లక్షల ఎకరాల భూమి గిరిజనేతరుల చేతుల్లో ఉందని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన జేఏసీ నాయకులు బి.శ్రీనివాసరావు, బి.ఉమామహేశ్వరరావు, బి.రామ్మోహన్‌రావు, వాబయోగి తదితరులు పాల్గొన్నారు.

8న మన్యం బంద్‌ను జయప్రదం చేయాలి
ముంచంగిపుట్టులో ఆదివాసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో 23 పంచాయతీల గిరిజనులు పాల్గొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి జీవో నంబర్‌ 3ను పునరుద్ధరించాలని, గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. గిరిజన సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి పి.బాలదేవ్, గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి.బాబూరావు, ఎంపీపీ అరిసెల సీతమ్మ మాట్లాడుతూ గిరిజన చట్టాలు, హక్కులను కాలరాసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 8న నిర్వహించే మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.  

జలాధివాసంలోకి సంగమేశ్వరుడు
నంద్యాల జిల్లా కొత్త పల్లి మండలంలోని ప్రాచీన సంగమేశ్వరాలయాన్ని కృష్ణా జలాలు చుట్టుముట్టాయి. దీంతో ఆలయ శిఖరం వరకు కృష్ణా జలాలు చేరాయి. ఎగువ నుంచి కృష్ణా జలాలు శ్రీశైలం జలాశయానికి వస్తుండటంతో ప్రాచీన సంగమేశ్వరాలయం జలాధివాసంలోకి వెళ్తోంది. సోమవారం ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామ శర్మ ఆలయ శిఖరాన్ని చేరుకుని కుంకుమార్చన, పుష్పార్చన, జలాభిõÙకం, మంగళహారతి వంటి విశేష పూజలు చేశారు. భక్తులు జలాధివాసానికి వెళ్తున్న సంగమేశ్వరాలయాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు.     – కొత్తపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement