కలెక్టరేట్ ప్రాంగణంలో ఓ తల్లి చేతిలో ఓ సాధారణ కాగితం..దానిపై వచ్చీరాని అక్షరాలతో రాసిన అర్జీ..పక్కన బిక్కుబిక్కుమంటూ నిలబడిన ఐదో తరగతి చదువుతున్న కూతురు. ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న అమాయకత్వంతో పార్వతీపురం మండలం కృష్ణపల్లికి చెందిన నిమ్మ దేవి అధికారుల ముందుకు వచ్చింది. ‘అయ్యా నాకు రావాల్సిన ’తల్లికి వందనం’ డబ్బులు రాకుండా చేశారని మాకు మీరే న్యాయం చేయాలి‘ అంటూ ఆ తల్లి అధికారులకు విన్నవించేందుకు తన కుమార్తెను వెంటేసుకుని, వచ్చీరాని రాతతో ఆ అమాయకపు తల్లి తన బిడ్డ భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ ఫిర్యాదు చేసింది. అలాగే ఇదే విషయమై, సాంకేతిక కారణాలతో ’తల్లికి వందనం’ సాయం జమకాలేదంటూ మరో 11 మంది మహిళలు సైతం ప్రజావాణిలోని ప్రత్యేక కౌంటర్‌లో అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు.


