బిడ్డకు తల్లిపాలే శ్రీరామరక్ష | - | Sakshi
Sakshi News home page

బిడ్డకు తల్లిపాలే శ్రీరామరక్ష

Aug 4 2026 1:35 AM | Updated on Aug 4 2026 1:35 AM

బిడ్డకు తల్లిపాలే శ్రీరామరక్ష ● డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ విజయలక్ష్మి

పార్వతీపురం రూరల్‌: పుట్టిన బిడ్డకు మొదటి ఆరునెలల వరకు తల్లిపాలే శ్రీరామరక్ష అని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పి.విజయలక్ష్మి స్పష్టంచేశారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సోమవారం పార్వతీపురంలో వైద్యారోగ్యశాఖ కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిబ్బందితో తల్లిపాల ఆవశ్యకతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు తాగించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. శిశువుకు తల్లిపాలు సంజీవనిలా పనిచేస్తాయన్నారు. కార్యక్రమంలో డీఐఓ డా.వై.విజయ్‌ మోహన్‌, ఆర్బీఎస్కే పీఓ డా.టి.జగన్‌మోహనరా వు, డీపీఎంఓ రవికుమార్‌ రెడ్డి, డీఎంఓ సూర్యనారాయణ, డిప్యూటీ డెమోలు గిరిబాబు, ప్రసాద్‌, డీపీఓ లీలారాణి, డీపీహెచ్‌ఎన్‌ఓ విజయలక్ష్మి, డీసీఎం విజయలత, సూపర్‌వైజర్లు పుష్ప, ఇందిర, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement