డాక్టర్‌ ఇంటిలో రూ.11 లక్షల బంగారం, వజ్రం చోరీ | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ ఇంటిలో రూ.11 లక్షల బంగారం, వజ్రం చోరీ

May 29 2023 7:02 AM | Updated on May 29 2023 7:19 AM

- - Sakshi

అన్నానగర్‌: కోయంబత్తూరులో ఆదివారం డాక్టర్‌ ఇంటిలో రూ.11 లక్షల బంగారం, వజ్రాలు చోరీ చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కోయంబత్తూరు రామనాథపురం కృష్ణస్వామి నగర్‌కు చెందిన శ్రీదేవి డాక్టర్‌. ఈమె ఇంటిలో కోయంబత్తూరుకు చెందిన తమిళసెల్వి (45) ఉంటూ ఇంటి పనులు చేస్తూ వచ్చింది. ఈ స్థితిలో శ్రీదేవి హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచిన డైమండ్‌రింగ్‌ మాయమైంది.

దీనిపై అనుమానంతో తమిళ సెల్విని అడిగితే తీసుకోలేదని చెప్పింది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించిది. ఆదివారం ఉదయం ఆమె తన ఇంటి బీరువాలో ఉంచిన 11 సవర్ల నగలు, రెండు జతల డైమండ్‌ ముక్కుస్టడ్‌లు, నాలుగు ఖరీదైన వాచీలు, రూ.2 లక్షల నగదు చోరీకి గురైనట్టు తెలిసి దిగ్భ్రాంతి చెందింది. వీటి మొత్తం విలువ రూ.11 లక్షలు. వెంటనే దీనిపై శ్రీదేవి రామనాథపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో పనిమనిషి తమిళసెల్విపై తనకు అనుమానం ఉందని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి తమిళ్‌ సెల్వి కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement