ప్రజలకు మెరుగైన సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు మెరుగైన సేవలందించాలి

Jul 20 2026 2:02 AM | Updated on Jul 20 2026 2:02 AM

చివ్వెంల(సూర్యాపేట) : పోలీసులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ నరసింహ అన్నారు. ఆదివారం రాత్రి చివ్వెంల పోలీస్‌ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని, సైబర్‌ మోసాలకు గురైన బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. మహిళలు, బాలల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని, వారి నుంచి వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళికా బద్ధంగా కృషి చేయాలన్నారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, వారిని చట్ట ప్రకారం బైండోవర్‌ చేయాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్‌, సీఐ రాజశేఖర్‌, ఎస్‌ఐ వి.మహేశ్వర్‌ ఉన్నారు.

ఎస్‌పీ నరసింహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement