సూర్యాపేట : సూర్యాపేటకు రైల్వే లైన్ సాధించాలనే లక్ష్యంతో ఏర్పాటైన రైల్వే సాధన సమితి పూర్తిస్థాయి నూతన కమిటీని మంగళవారం ఎన్నుకుని ప్రకటించారు. కన్వీనర్‌గా డేగల జనార్ధన్, కో కన్వీనర్‌గా రాచూరి ప్రతాప్, గౌరవ సలహాదారులుగా డాక్టర్ వి.రామ్మూర్తి, లింగంపల్లి భద్రయ్య, ఎన్.అయోధ్య, చింతలపాటి చిన్న శ్రీరాములు, గౌరవ అధ్యక్షుడిగా డాక్టర్ కె.రంగారెడ్డితో పాటుగా 29 మందితో కమిటీని వేసినట్లు కన్వీనర్ డేగల జనార్దన్ ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్ వూర రామమూర్తి మాట్లాడుతూ సూర్యాపేటకు రైలు వచ్చేవరకు పోరాటం ఆగదన్నారు. సూర్యాపేట వాణిజ్య భవన్ చౌరస్తాలో ఈనెల 24 పదివేల సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నల్లపాటి అప్పారావు, నూకల సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఏ రమేష్ చంద్ర, కర్పూరపు రాజేందర్, నీల శ్రీనివాస్, గుండా హరి నారాయణ, నల్లపాటి అప్పారావు, భయ్యా మల్లికార్జున్, మామిడి అంజయ్య, బొమ్మిడి లక్ష్మీనారాయణ, అంతటి విజయ్, గండూరి కృపాకర్, అప్పం శ్రీనివాస్, యామా ప్రభాకర్, పిట్టల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.


